Devara: దేవర చూసే వరకైనా బ్రతికించండి - దీనస్థితిలో అభిమాని..!

NTR Fan Suffers Cancer: 19 సంవత్సరాల కౌశిక్ అనే ఒక యువకుడు బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతూ.. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా చూసేంత వరకు అయినా సరే తనను కాపాడాలని వైద్యులను వేడుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 12, 2024, 01:21 PM IST
Devara: దేవర చూసే వరకైనా బ్రతికించండి - దీనస్థితిలో అభిమాని..!

Jr NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  ఆ ఫ్యాన్ బేస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అలాంటి అభిమానులలో ఒకరు ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. అయితే సదరు అభిమాని చివరి కోరిక ఏంటో తెలిస్తే హృదయం ద్రవించకమానదు. తనను బ్రతికించమని అడగడం లేదు కనీసం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా చూసేవరకైనా తనను బ్రతికించండి చాలు అంటూ వేడుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే ఆంధ్రప్రదేశ్ కి  చెందిన కౌశిక్ అనే 19 సంవత్సరాల యువకుడు,  2022 నుంచి బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ వీరాభిమాని అయినా ఇతడు బెంగళూరులో కిడ్ వై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేవర సినిమా చూసేంత వరకు అయినా సరే తనను బ్రతికించాలని , ఆ అభిమాని అక్కడి డాక్టర్లను వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే  తమ కొడుకు చివరి కోరిక తీర్చాలని అతడి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , హీరో జూనియర్ ఎన్టీఆర్ లను  వేడుకుంటున్నారు. 

తాజాగా కౌశిక్ తల్లి సరస్వతి మీడియాతో మాట్లాడుతూ.. నా కొడుకుకి చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు పండగ చేసుకుంటాడు. రెండు సంవత్సరాలుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అతడు చికిత్స కోసం రూ.60 లక్షల వరకు ఖర్చవుతుంది. 

మరోవైపు ఎన్టీఆర్ నటించిన దేవర  సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది కాబట్టి కనీసం అప్పటి వరకు అయిన తన  కొడుకును బ్రతికించండి అంటూ ఆమె వేడుకుంటుంది. దీన్ని చూస్తుంటే ప్రాణం పోతుంది అంటూ కన్నీరు మున్నీరు అవుతోంది.

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర  సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగానే మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో బాలీవుడ్ హీరో జాన్వీ కపూర్ హీరోయిన్ గా అవకాశం అందుకోగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.

 

Also Read: Infinix Zero 40: కేక పెట్టించే ఫీచర్లు, 108MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమేరాతో Infinix

Also Read: Malaika father Suicide: స్టార్‌ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 7వ ఫ్లోర్‌ నుంచి దూకి సూసైడ్‌.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News