NTR - Hrithik Roshan - War 2: వార్ 2లో ఎన్టీఆర్ డబుల్ ధమాకా.. అభిమానులకు పండగే పండగ..

NTR - Hrithik Roshan - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి నార్త్,  సౌత్ స్టార్ హీరోల కలయికలో వస్తోన్న మూవీ 'వార్ 2'.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభిమానులకు డబుబ్ ధమాకా ఇవ్వబోతున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 8, 2024, 02:46 PM IST
NTR - Hrithik Roshan - War 2: వార్ 2లో ఎన్టీఆర్ డబుల్ ధమాకా..  అభిమానులకు పండగే పండగ..

NTR - Hrithik - War 2:  ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి దక్షిణాది, ఉత్తరాది వంటి బలమైన స్టార్‌డమ్ ఉన్న హీరోలు నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. అసలు సిసలు ప్యాన్ ఇండియా మల్టీస్టారర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.  ఇప్పటికే హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.  త్వరలో తారక్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఒకటి పాజిటివ్ క్యారెక్టర్ అయితే.. మరొకటి పూర్తి నెగిటివ్ క్యారెక్టర్ అని చెబుతున్నారు. జై లవకుశలో ఎన్టీఆర్ హీరో కమ్ విలన్ పాత్రలో నటించాడు. ఇపుడు అదే తరహాలో ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్ఫుల్‌గా ఉండబోతున్నట్టు సమాచారం.  మహా భారతంలోని కృష్ణార్జునుల తరహాలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికే హృతిక్ పై దర్శకుడు అయాన్ ముఖర్జీ జపాన్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మరోవైపు ఎన్టీఆర్.. ఈ సినిమా షూటింగ్‌లో త్వరలో జాయిన్ కానున్నాడు. ఈసినిమాలో ఎన్టీఆర్‌తో పాటు మరో తెలుగు నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో జగ్గూ భాయ్ కనిపించనున్నట్టు సమాచారం.

ఇప్పటికే 'వార్ 2' మూవీ కోసం రామోజీ ఫిల్మ్స్ సిటీలో ప్రత్యేక సెట్‌ వేసారు. అక్కడ అయాన్ ముఖర్జీ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో తారక్  పై షూట్ ప్రారంభించనున్నారు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. దాదాపు రెండు నెలల డేట్స్ కేటాయించారట.  అందులో ఓ నెల రోజుల పాటు ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు నటిస్తోన్న  కొన్ని కీలక సీన్స్‌ను పిక్చరైజ్ చేస్తారట.  మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు తరహాలో ఇందులో ఎన్టీఆర్, హృతిక్‌లపై ప్రత్యేక గీతాన్ని ఇందులో పెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు ఈ పాట హైలెట్‌గా నిలిచే అవకాశాలున్నాయి. తారక్, హృతిక్ లపై వచ్చే సీన్స్ ఆడియన్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయనేది టాక్. ఈ చిత్రంలో హృతిక్ షూటింగ్ పార్ట్ జూన్ చివరి వరకు కంప్లీట్ కానుంది. మరోవైపు తారక్ షూటింగ్ పార్ట్ జూలై వరకు కంప్లీట్ కానుంది.   
    
ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా  చేస్తున్నాడు. ఈ మూవీని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.  జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.  దేవరను అక్టోబర్ 10న దసరా  కానుకగా విడుదల చేయనున్నారు. మరోవైపు తారక్.. ప్రశాంత్ నీల్ మూవీని ఈ యేడాది చివర్లో మొదలు పెట్టనున్నాడు.  మొత్తంగా తారక్.. ఎలాంటి ఈగోలకు పోకుండా ఇతర స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో పాటు మరో హిందీలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు అట్లీతో ఎన్టీఆర్  ఓ సినిమా చేయనున్నారు. అల్లు అర్జున్ మూవీ తర్వాత ఈ సినిమా ఉండనుంది.  దాంతో పాటు  కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్‌లతో కూడా తారక్  చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. త్వరలో వీళ్లిద్దరితో చేయబోయే సినిమాలను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.  అటు హృతికో రోషన్ విషయానికొస్తే.. రీసెంట్‌గా 'ఫైటర్' మూవీతో పలకరించారు. అటు క్రిష్ 4 మూవీ చేయనున్నారు.

Also Read: KCR Arrest: కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్‌ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ఇదేనా?

Also Read: Tukkuguda Meeting: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News