Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ నుంచి అదిరిపోయిన మూడో సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్..

Devara Third Single: ఎన్టీఆర్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన  రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్ ను విడుదల చేశారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 4, 2024, 05:59 PM IST
Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ నుంచి అదిరిపోయిన మూడో సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్..

Devara Third Single: రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత సోలో హీరోగా కొరటాల శివ ధర్శకత్వంలో ‘దేవర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్. ముందుగా ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అటు పవన్ కళ్యాణ్ ‘ఓజీ ’ మూవీ లేట్ కావడంతో ఆ తారీఖులో రెండు వారాలుగా ముందుగానే సెప్టెంబర్ 27న  సోలో రిలీజ్ కు రెడీ అయింది దేవర్ పార్ట్ -1. ఇప్పటికే విడుదలైన దేవరలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ తో చేసిన డ్యూయల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేసారు. ఇది కూడా యుగళ గీతమే. ఈ పాటలో జాన్వీ కపూర్ మరోసారి తన అందాలతో అలరించింది.

దావూది అంటూ సాగే ఈ పాట వినగా వినగా ఆకట్టుకునే విధంగా వుంది. అనిరుద్ అద్భుత‌మైన మ్యూజిక్  అందించారు. పెప్పీ బీట్స్‌కు ఆయ‌నెలాంటి సంగీతాన్ని అందిస్తారో అంద‌రికీ తెలిసిందే. దేవ‌ర‌లో దావుడి సాంగ్‌ను వావ్ అనిపించేలా కంపోజ్ చేశారు అనిరుథ్. తెలుగులో రామజోగ‌య్య శాస్త్రి  రాసిన ఈ పాట‌ను త‌మిళంలో విఘ్నేష్ శివ‌న్‌.. హిందీలో కౌస‌ర్ మునీర్.. క‌న్న‌డ‌లో వ‌ర‌ద‌రాజ్ చిక్‌బ‌ల్లాపుర‌.. మ‌ల‌యాళంలో మాన్‌కొంబు గోపాల‌కృష్ణ పాటను రాశారు.

పాటకు గాత్రం అందించిన వారి విషయానికొస్తే.. న‌క‌ష్ అజీజ్‌, ఆకాశ తెలుగు, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ పాటను ఆల‌పించారు. న‌క‌ష్ అజీజ్‌, ర‌మ్యా బెహ్రా త‌మిళ‌, మ‌ల‌యాళంలో పాట‌ను పాడటం విశేషం. మ్యూజిక్ ట్రాక్‌, పాట‌ను తెర‌కెక్కించిన తీరు చూస్తుంటే పాన్ ఇండియా ఎక్స్‌పీరెయెన్స్ తో సరికొత్తగా ఈ పాట ఉంది.శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించిన ఈ  పాటలో ఎన్టీఆర్ సూపర్ స్టెప్స్ తో అలరించారు. మరోవైపు జాన్వీ లుక్ అదిరిపోయింది. తార‌క్‌, జాన్వీ మ‌ధ్య కెమిస్ట్రీ అదుర్స్ అని చెప్పాలి. ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా విషయానికొస్తే.. సోలో హీరోగా ఎన్టీఆర్ కు తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ మూవీ అన్ని ఏరియాల్లో థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది. మరోవైపు ఓవర్సీస్ లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. కర్ణాటకలో రూ. 18 కోట్లకు.. రాయలసీమలో ఈ సినిమా రూ. 23 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం.

ఇక హిందీలో ‘దేవర’ దాదాపు రూ. 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఓవరాల్ గా థియేట్రికల్ గా రూ. 150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు  సమాచారం. ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా  టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News