Jr NTR Watch Price : ఎన్టీఆర్ వాచ్‌కి అన్ని కోట్లా?.. రేంజ్ అంటే ఇదే మరి

Jr NTR Watch Price ఎన్టీఆర్ ప్రస్తుతం వార్తల్లో ట్రెండ్ అవుతున్నాడు. ఎన్టీఆర్ ధరించిన గడియారం రేట్‌ తెలిసి అంతా షాక్ అవుతున్నారు. వాచ్‌కే ఎనిమిది కోట్లు పెట్టాడా? అంటూ జనాలంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. ఎన్టీఆర్ వాచ్‌ ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 08:02 PM IST
  • నెట్టింట్లో ఎన్టీఆర్ ఫోటోలు వైరల్
  • ఎన్టీఆర్ ధరించిన వాచ్‌ మీద చర్చలు
  • గడియారానికే కోట్లు పెట్టిన ఎన్టీఆర్
Jr NTR Watch Price : ఎన్టీఆర్ వాచ్‌కి అన్ని కోట్లా?.. రేంజ్ అంటే ఇదే మరి

Jr NTR Watch Price యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్నాడు. టాలీవుడ్ దిగ్గజ దర్శకులు, నిర్మాతలను తన ఇంటికి పిలిపించుకుని గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫోటోల్లో ఎన్టీఆర్ ధరించిన వాచ్‌ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ వాచ్ ధర తెలిసి అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. ఎనిమిది కోట్లకు పైనే ఈ వాచ్ ధర ఉంటుందని తెలుస్తోంది.

మామూలుగా పవన్ కళ్యాణ్‌, ఎన్టీఆర్, బన్నీ, చెర్రీ ధరించే బట్టలు, షూలు, వాచ్‌ల గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ప్రభాస్ ధరించే కళ్లద్దాలు, కార్లు, బూట్లు, డ్రెస్సుల మీద సైతం ఎక్కువగా చర్చలు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ వాచ్ మీద నెట్టింట్లో ఎక్కువగా జనాలు మాట్లాడుకుంటున్నారు.

ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీలో రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ వంటి వారు మెరిసిన సంగతి తెలిసిందే. సుకుమార్ కూడా రావాల్సింది కానీ పుష్ప పార్ట్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడట. ఇక ఈ పార్టీకి ఎన్టీఆర్ అయితే హీరోలెవ్వరినీ కూడా పిలవలేదని టాక్. జస్ట్ తనకు ప్రియమైన దర్శక నిర్మాతలకు మాత్రమే ఆహ్వానం వెళ్లిందని తెలుస్తోంది.

Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్

ఏదైనా కొత్త ప్రాజెక్ట్, భారీ బడ్జెట్ సినిమాను తనకు సెట్ చేసుకునేందుకు ఎన్టీఆర్ ఈ పార్టీని ఏర్పాటు చేశాడా? అనే టాక్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ లైనప్‌ భారీగా ఉంది. కొరటాల శివ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. దాని తరువాత వార్ 2 సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే.

కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాకు వస్తున్నా అనే టైటిల్‌ను పెట్టాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ డైలాగ్ బాగా పాపులర్ అవ్వడంతో వస్తున్నా అనే టైటిల్‌ను పెట్టాలని చిత్రయూనిట్ భావిస్తోందట. ఇక ఈ చిత్రంతో జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినట్టు అవుతోంది.

Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News