Jyothika: జ్యోతిక అమ్మ ఒడి ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్.. ఐదేళ్ల తర్వాత తెలుగులో రిలీజ్..

jyothika : కొంత మంది హీరోయిన్స్ అంతే.. పెళ్లైనా వరుస సినిమాలతో అదరగొట్టే వాళ్లు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అప్పట్లో షావుకారు జానకి, సావిత్రి, జమున, జయసుధ వంటి కథానాయికలు పెళ్లి తర్వాత కూడా స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. ఇపుడు అదే కోవలో జ్యోతిక, కాజల్, వంటి హీరోయిన్స్ కూడా పెళ్లి తర్వాత కూడా అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 7, 2024, 09:52 AM IST
Jyothika: జ్యోతిక అమ్మ ఒడి ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్.. ఐదేళ్ల తర్వాత తెలుగులో రిలీజ్..

Jyothika : జ్యోతిక విషయానికొస్తే.. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో అలరిస్తోంది. అది కూడా లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో పలకరిస్తోంది. రీసెంట్‌గా మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన 'కాథల్' మూవీలో విలక్షణమైన నటన కనబరించింది. అటు హిందీలో షైతాన్, శ్రీ, దెబ్బ కార్టల్ వంటి సినిమాలతో పలకరించబోతుంది. తాజాగా ఈమె ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్ బ్యానర్ పై  ఎస్ ఆర్ ప్రకాష్ ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన తమిళ చిత్రం రాక్షసి. ఐదేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.  తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో 'అమ్మ ఒడి' టైటిల్ తో విడుదల చేస్తున్నారు. వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డి ఈ సినిమాను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. జ్యోతిక సూర్యతో పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. అందుకోసమే ఈమె ముంబైకు షిప్ట్ అయింది. అక్కడైతే బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేయడానికి కన్వినెంట్‌గా ఉంటుందనే ఉద్దేశ్యంతో అక్కడికి మకాం మార్చింది. దీనిపై కోలీవుడ్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సూర్యతో జ్యోతిక విడాకులు తీసుకుందా కామెంట్స్ కూడా వినపడ్డాయి. దీనిపై జ్యోతిక గట్టి సమాధానమే చెప్పింది.

ఈ సంగతి పక్కన పెడితే.. జ్యోతిక నటించిన రాక్షసి తెలుగు వెర్షన్ 'అమ్మ ఒడి' సినిమా తెలుగు ట్రైలర్ విడుదల చేస్తే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో జ్యోతిక.. ప్రభుత్వ బడుల రూపురేఖలు పూర్తిగా మార్చివేసే టీచర్ పాత్రలో నటించింది. పాడుబడ్డ స్కూళ్లను.. పునరుద్దించాలనుకునే పాత్రలో జ్యోతిక నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే వారికి ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేస్తూ ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు. నాగినీడు హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు.   

ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలైన  వడ్డి రామానుజమ్, వల్లెం శేషారెడ్డి మాట్లాడుతూ.."తెలుగు ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను చూపించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ రాజ్  చక్కగా తెరకెక్కించినట్టు చెప్పారు. డబ్బింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామన్నారు. గతేడాది ధనుశ్ హీరోగా తెరకెక్కిన 'సార్' మూవీ కూడా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. గతంలో కూడా ఎన్నో చిత్రాలు ఉపాధ్యాయులు ఔనత్యాన్ని చాటేలా తెరకెక్కాయి.

ఇదీ చదవండి: Ruchaka Rajyog 2024: రుచకరాజ్యయోగం ఈరాశికి ప్రత్యేకం.. మార్చిలోగా కొత్త ఉద్యోగం, కాసులవర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News