నాన్న గారి ఆరోగ్యంపై దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు... కైకాల కుమార్తె రమాదేవి విజ్ఞప్తి..

kaikala satyanarayana health update: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమార్తె రమాదేవి స్పందించారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. దయచేసి ఆయన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 12:27 PM IST
  • కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై కుమార్తె రమాదేవి స్పందన
    కైకాల ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పిన రమాదేవి
    కైకాల ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు ప్రచారం వద్దని విజ్ఞప్తి
నాన్న గారి ఆరోగ్యంపై దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు... కైకాల కుమార్తె రమాదేవి విజ్ఞప్తి..

kaikala satyanarayana health update: తెలుగు నట దిగ్గజం కైకాల సత్యనారాయణ గత 3 రోజులుగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కైకాల (Kaikala Satyanarayana) ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆయన కుమార్తె రమాదేవి స్పందించారు. 'నాన్న గారి ఆరోగ్యం మెరుగుపడుతోంది. చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. అందరితోనూ మాట్లాడుతున్నారు. నిన్న డాక్టర్, యాక్టర్ మాదాల రవి గారు వచ్చారు. ఆయనతో నాన్నగారు మాట్లాడారు. థంబ్స్ అప్ సింబల్ చూపించారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీవీల్లో తప్పుడు సమాచారం చూపించి అందరినీ ఆందోళనకు గురిచేయవద్దు.' అని రమాదేవి విజ్ఞప్తి చేశారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana health) శనివారం (నవంబర్ 20) ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. కైకాల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు నిన్నటి హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. బీపీ లెవల్స్ పడిపోవడంతో వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Also Read: 'బంగార్రాజు' టీజర్ వచ్చేసింది.. నాగచైతన్య లుక్ అదుర్స్..

కైకాల ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోమవారం (నవంబర్ 22) ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 'ఐసీయూలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలిసి క్రిటికల్ కేర్ డా.సుబ్బారెడ్డి ద్వారా ఆయన్ను ఫోన్‌లో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది. ట్రాకియాస్టోమీ కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా... మళ్లీ త్వరలో ఇంటికి తిరిగిరావాలని, ఆ సందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని అన్నప్పుడు.. నవ్వుతూ థంబ్స్ అప్ సైగా చేశారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగిరావాలని ప్రార్థిస్తూ... అభిమానులు, శ్రేయోభిషులాందరితో ఈ విషయం పంచుకోవడం సంతోషంగా ఉంది.' అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News