Honeymoon trip: స్కూబా డైవ్ చేసిన కొత్తజంట కాజల్, గౌతమ్

ప్రముఖ సినీనటి, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal ) అక్టోబరు 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు (Gautam Kitchlu) ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం అనంతరం ఈ కొత్త జంట హనీమూన్‌కు మాల్దీవులు వెళ్లింది. అప్పటినుంచి కాజల్, గౌతమ్ సరికొత్త ఫొటోలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

Last Updated : Nov 16, 2020, 02:30 PM IST
Honeymoon trip: స్కూబా డైవ్ చేసిన కొత్తజంట కాజల్, గౌతమ్

Honeymoon - Kajal Aggarwal, Gautam doing scuba diving| ప్రముఖ సినీనటి, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal ) అక్టోబరు 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు (Gautam Kitchlu) ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం అనంతరం ఈ కొత్త జంట హనీమూన్‌కు మాల్దీవులు వెళ్లింది. అప్పటినుంచి కాజల్, గౌతమ్ సరికొత్త ఫొటోలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇసుక తిన్నెలపై, అండర్ వాటర్‌లో ఫొటోలకు ఫొజులిస్తూ వచ్చిన ఈ జంట తాజాగా స్కూబా డైవ్‌ (scuba diving) చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. స్కూబా డైవ్ చేస్తున్న ఫొటోలను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇంకేముంది ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. Also read: Seerat kapoor: సీరత్ కపూర్ స్టన్నింగ్ ఫొటోలు..

 

మాల్దీవుల్లో హనీమూన్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్న ఈ జంటను చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు. ఈ క్రమంలోనే స్కూబా డైవ్ చేస్తున్న ఫొటోలను చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఎదీఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ కొత్త జంట మాత్రం ఫ్యాన్స్‌కు మామూలు థ్రిల్ ఇవ్వడం లేదని అందరూ పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. కాజల్ అగర్వాల్ మ‌రి కొద్ది రోజుల్లోనే కాజ‌ల్ హ‌నీమూన్‌కు బై చెప్పేసి కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య షూటింగ్‌లో పాల్గొన‌నుందని తెలుస్తోంది. చిరంజీవికి కరోనా నెగెటివ్ రావ‌డంతో ఆయ‌న కూడా త్వరలో టీంతో జాయిన్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. Also read: Allu Arjun: అభిమానితో ఫొటోలు దిగిన పుష్పరాజ్‌

Also read: Ananya Panday: న్యూ స్టిల్స్‌తో మైమరిపిస్తున్న ‘ఫైటర్’ బ్యూటీ అనన్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News