ఎట్టకేలకు కమల్ "విశ్వరూపం 2"కి మోక్షం

కమల్ "విశ్వరూపం 2" చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది.

Last Updated : Nov 30, 2017, 07:12 PM IST
 ఎట్టకేలకు కమల్ "విశ్వరూపం 2"కి మోక్షం

కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "విశ్వరూపం 2" అనే విషయం మనకు తెలిసిందే.  "విశ్వరూపం" చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం కొద్ది నెలల క్రితం వరకు ఎదుర్కొన్న ఆటుపోటులు అన్నీ ఇన్నీ కావు. సెన్సార్ సమస్యలతో పాటు.. పలు ఆర్థిక సమస్యలు కూడా ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. అయితే వాటన్నింటినీ జయించిన కమల్, ఎట్టకేలకు ఈ చిత్రాన్ని విడుదల చేయడం కోసం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. జనవరి 26వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారట.

అదే తేదీన తొలుత రజనీ చిత్రం  2.0ను విడుదల చేయాలనుకున్నారు ఆ చిత్ర నిర్మాతలు. అయితే సీజీ వర్క్స్ పెండింగ్ ఉండడంతో ఏప్రిల్‌కు విడుదల తేదీని మార్చారు. అందుచేత సాధ్యమైనంత వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రిపబ్లిక్ డే నాడే తన చిత్రాన్ని విడుదల చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట కమల్. 

Trending News