Atharva Release Date: సస్పెన్స్, క్రైమ్ జానర్లో మూవీ అంటే ఆడియన్స్‌కు ఎప్పుడూ ఓ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రెండు జానర్లకు రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను యూత్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కించిన మూవీ అథర్వ. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో మూవీపై బజ్ క్రియేట్ అయింది. ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్ని ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 1న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా మీడియాతో దర్శకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి క్రైమ్ సీన్‌కు క్లూ చాలా ముఖ్యమని.. క్లూస్ లేకుండా కేసు ఛేదించడం సాధ్యం కాదు. ఒక కేసులో క్లూస్, ఎవిడెన్స్‌ను వెతికే డిపార్ట్‌మెంట్ గురించి ఈ సినిమా ఉంటుంది. కార్తీక్ రాజు బయోమెట్రిక్ అనలిస్ట్ పాత్రలో నటించగా.. సిమ్రాన్ చౌదరి జర్నలిస్ట్ క్యారెక్టర్‌లో నటించింది. నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా కోసం టెక్నిషియన్స్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చిత్రబృందానికి మంచి పేరు తీసుకువస్తుంది. డిసెంబర్ 1న ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూడాలి.." అని కోరారు.
అనంతరం హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ.. ఈ స్టోరీ కథ విన్నప్పుడే కొత్త అటెంప్ట్ చేస్తున్నామని అనిపించింది. నాకు తెలిసినంత వరకు క్లూస్ టీమ్ మీద మన దేశంలో ఇప్పటివరకు ఎవరూ సినిమా తీయలేదు. దర్శకుడు ఎంతో ప్యాషన్‌తో సినిమా తీశారు. ఇటీవల క్లూస్ డిపార్ట్మెంట్‌కు స్పెషల్ షో వేశాం. వాళ్లు సినిమా చూసి.. డైరెక్టర్ పర్ఫెక్షన్‌ను మెచ్చుకున్నారు. హీరోయిన్ సిమ్రాన్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది.." అని నమ్మకంతో చెప్పాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోందని హీరోయిన్ సిమ్రాన్ చౌదరి తెలిపింది. డిసెంబర్ 1న సినిమా విడుదల అవుతుందని.. అందరూ థియేటర్స్‌కు వచ్చి చూడాలని కోరింది.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. డీఏ పెంపు కొత్త లెక్కలు ఇలా..!
Also Read: Free Ration Scheme: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు పొడగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook