Brahmamudi: అసలు విషయం చెప్పి కావ్యను హత్తుకున్న రాజ్‌.. అదిరిపోయే రొమాంటిక్‌ సీన్‌, ఇంకెవరినో ట్రై చేస్తున్న కవి..

Brahmamudi Today December 20th Episode: ఇక అప్పు కవితో బాగోగులు మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి విజిట్‌ చేయి అని అడుగుంది. కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. వాటిని చూసుకుని వస్తా అంటాడు. అక్కడ నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను కూడా ఇక్కడ అంత కష్టపడుతున్న అంటాడు. నేను లేను కదా అని ఇంకెవరినైనా ట్రై చేస్తున్నావా? నిజం చెప్పు అంటుంది. సర్లే నాకు అంత ధైర్యం లేదు నేను మళ్లీ ఫోన్‌ చేస్తా అని పెట్టేస్తాడు. అప్పుకూ ఏదో డౌట్‌ కొడుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Dec 20, 2024, 08:33 AM IST
Brahmamudi: అసలు విషయం చెప్పి కావ్యను హత్తుకున్న రాజ్‌.. అదిరిపోయే రొమాంటిక్‌ సీన్‌, ఇంకెవరినో ట్రై చేస్తున్న కవి..

Brahmamudi Today December 20th Episode:  ఇక వంటగదిలో కళావతితో మాట్లాడటానికి వస్తాడు రాజ్‌.వెతకారపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ కిచెన్‌ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు అసలు విషయం చెప్పండి అంటుంది కావ్య.. అది.. అది..  అనకుంటూ ఉంటాడు. నాన్చకుండా విషయం చెప్పండి అంటుంది. అది.. అది... టీ కావాలి అంటాడు రాజ్‌.అసలు విషయం చెప్పకుండా ఉంటాడు రాజ్‌. ఏంటో  కొత్త కొత్త అలవాట్లు నేర్చకుంటున్నాడు అంటుంది కావ్య. ఎవరినీ ఏమి చేయలేనప్పుడు కనీసం మాటలతో అయినా బతకాలి కదా అంటుంది కావ్య. ఫ్రిజ్‌లో పాలు తీసుకుని రాజ్‌ టీ పెట్టుకుంటూ ఉంటాడు. కావ్యతో చెబుదాం అని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అపర్ణ వస్తుంది. ఏం చేస్తున్నావ్‌ రా.. అంటుంది. 

టీ కావాలంటే టీ పొడి కలపాలి,కాఫీ పొడి కాదు నాన్న అంటుంది. నేను పెట్టిస్తా అని టీ పెట్టిస్తుంది. కావ్యను అడుగొచ్చు కదా అంటుంది. డిషెస్‌ వాష్‌ చేస్తుంది కదా మమ్మి ఇబ్బంది పడుతుంది అంటాడు. దీంతో గ్రేట్‌ కావ్య ఇబ్బంది గురించి మాట్లాడుతున్నావా? నీలో మార్పు ఇంత తొందరగా వస్తుందా? అని నవ్వుతుంది. దీంతో రాజ్‌ పోమమ్మి అంటూ వెళ్లిపోతాడు. అవును నిన్ను చూస్తే అల్లంత దూరానా ఉండేవాడు, నువ్వు ఏమైనా మంత్రించావా? ఇప్పుడు టీ కోసం కూడా నీ దగ్గరకు వస్తున్నాడు అంటుంది అపర్ణ. లేదు అత్తయ్య అంటుంది కావ్య..

బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌ బూజు దులుపుతూ ఉంటుంది. అప్పుడే రాజ్‌ వస్తాడు. కళావతి అని అరుస్తాడు కంగరు పడుతూ కింద పడిపోతున్న కావ్యను పట్టుకుంటాడు. అప్పుడే ఓ బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ వేసుకుంటారు.  నువ్వు డపులివి, అడవి సింహానికి అంటూ ఆకాశానికి ఎత్తుతాడు. నేను నీకు ఏవిధంగా సహాయపడాలి అంటాడు. ఈరోజు నా చుట్టు ఎందుకు తిరుగుతున్నారు అంటుంది. ఆఫీస్‌ పనిలేదు అంతే అంటాడు, సీలింగ్‌ నేను క్లీన్‌ చేస్తా అని క్లీన్‌ చేస్తూ ఉంటాడు. బెడ్‌పై అటూ ఇటూ తిరుగుతూ కళావతి నీతో ఒక విషయం చెప్పాలి..  అది, అది అంటూ ముందుకు జరిగి కావ్య పై పడతారు ఇద్దరూ ఒకరిపై ఒకరు కిందపడతారు. మళ్లీ బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ అప్పుడే ధాన్యం, రుద్రాణీలు చూస్తారు. తేరుకుని లేచి పరుగెత్తుతాడు రాజ్‌. ఇక ధాన్యం, రుద్రాణీలు కారాలు మిరియాలు నూరుతుంటారు. 

ఇంట్లో ఇంత మంది ఉన్న సిగ్గు లేకుండా వేళాపాళా లేదు అంటుంది ధాన్యం. జంట పక్షుల రొమాన్స్ అలా ఉంది అంటుంది రుద్రాణీ. తర్వాత జరిగే పరిణామాలు తెలుస్తున్నాయా? నువ్వు సగం సగం అర్థం చేసుకుంటున్నావ్. వారిద్దరూ అలా కలిస్తే మనిద్దరం ఏం చేయలేం అంటుంది రుద్రాణీ. ఇలా రొమాన్స్‌ చేస్తున్నారు. ఆ కంపెనీ రాజ్ చేతిలో, ఇల్లు కావ్య చేతిలో రాజు రాణిలా దుగ్గిరాల సామ్రాజ్యాన్ని ఏలుతారు. నీకొడుకు కవిలా ఉంటాడు. నా కొడుకు సైన్యాధిపతిలా ఉంటాడు ఇలా నీకు ఓకేనా అంటుంది రుద్రాణీ. అలా ఎలా కుదురుతుంది అంటుంది ధాన్యం.  మరి ఎలా చేస్తే నీ వాటా నీకు వస్తుంది దాని గురించి ఆలోచించు అని చెప్పి వెళ్తుంది రుద్రాణీ.

ఇదీ చదవండి: రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు!  

అపర్ఱ, జగదీష్‌కు కాఫీ ఇస్తుంది. రాజ్‌ చాలా మారిపోయాడు అంటుంది అపర్ణ. మనముందు కావ్య అంటే ఇష్టం లేకుండా ఉంటాడు చాటుగా కావ్యకు దగ్గర అవుతున్నాడు.  ఇక కావ్యతో రాజ్‌ ముచ్చట్ల గురించి చెబుతూ ఉంటుంది అపర్ణ.పక్కనే కావ్య వింటుంది. ఇది గుడ్‌న్యూస్‌ కదా అంటాడు జగదీష్‌. త్వరలోనే వాడి మనస్సులోని ప్రేమను బయట పెడతాడు అంటుంది. నిజంగా ఆయన గారిలో అంత మార్పు వచ్చిందా? చూద్దాం ఆయన ఎలా ప్రపోజ్‌ చేస్తాడో అని మనస్సులో అనుకుంటుంది కావ్య.

ఇదీ చదవండి: కావ్యకు చెలికత్తెల్లా రుద్రాణీ, ధాన్యలక్ష్మిలు.. పోలీస్‌ ట్రైనింగ్‌లో పొట్టి అవస్థలు..

ఇక రాత్రి అవుతుంది. రాజ్‌ పేరట్లో ఉంటాడు. అప్పుడే కాల్ వస్తుంది. సార్‌, రేపు బ్యాంక్‌ ఆఫీసర్లు ఆఫీస్‌కు వస్తున్నారు లేకపోతే జప్తు చేస్తారు అని పీఏ అంటాడు. కాల్‌ కట్‌ చేసి రాజ్‌ ఎలాగైన కళావతి హెల్ప్‌ తీసుకుని ప్రాబ్లెం సాల్వ్‌ చేసుకోవాలి అని బెడ్‌రూంలోకి వస్తాడు. తలుపు వేయన, గడియా పెట్టనా అంటాడు. దీనికి కావ్య మీ ఇష్టం అంటుంది. రాజ్‌ మాత్రం అసలు విషయం చెప్పడానికి వస్తాడు. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా అంటాడు. నేను ఒక పెద్ద సమస్యలో ఉన్న స్వరాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌కు ఒక సమస్య వచ్చింది అసలు విషయం చెప్పి కావ్యను హత్తుకుంటాడు రాజ్‌.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News