Keerthy Suresh : గటగటా కల్లు తాగేసిన కీర్తి సురేష్‌.. తెల్ల చీరలో మహానటి అందాలు.. వీడియో వైరల్

Keerthy Suresh Drinks Sara కీర్తి సురేష్‌ ప్రస్తుతం దసరా సినిమాను గట్టిగా ప్రమోట్ చేసే పనిలో పడిపోయింది. కీర్తి సురేష్‌ తాజాగా తెల్ల చీరకట్టుకుని అందరినీ ఆకట్టుకుంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తి సురేష్‌ కల్లు తాగేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 10:04 PM IST
  • మార్చి 30న రాబోతోన్న దసరా
  • ప్రమోషన్స్‌లో నాని, కీర్తి సురేష్‌ సందడి
  • గటగటా కల్లు తాగేసిన కీర్తి సురేష్‌
Keerthy Suresh : గటగటా కల్లు తాగేసిన కీర్తి సురేష్‌.. తెల్ల చీరలో మహానటి అందాలు.. వీడియో వైరల్

Keerthy Suresh Drinks Sara నాని, కీర్తి సురేష్‌ కలిసి నటించిన దసరా సినిమా మార్చి 30న రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని దేశ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ కావడంతో.. ప్రమోషన్స్ ముందు నుంచే మొదలుపెట్టేశారు. దేశమంతా కూడా నాని, కీర్తి సురేష్‌లు తిరుగుతున్నారు. తాజాగా రానాని కూడా దసరా ప్రమోషన్స్‌కు పట్టుకొచ్చాడు నాని. అక్కడ నాని, రానా, కీర్తి సురేష్‌లు పోటీ పడి మరీ కల్లు తాగేశారు. కీర్తి సురేష్ అయితే నాన్ స్టాప్‌గా గుట్టగుట్ట తాగేసి షాక్ ఇచ్చింది.

దసరా సినిమా కోసం నాని, కీర్తి సురేష్‌లు బాగానే కష్టపడుతున్నారు. ఈ సినిమాను ఎలాగైనా వీలైనంతగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే గత రెండు మూడు వారాల నుంచి గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. పాటలు ఆల్రెడీ క్లిక్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ అన్నీ కూడా బాగానే హైప్ క్రియేట్ చేశాయి. వాటికి తగ్గట్టుగా నాని, కీర్తి సురేష్‌లు మీడియాతో తెగ ఇంటరాక్ట్ అవుతున్నారు.

నాని అయితే మొదటి సారిగా ట్విట్టర్‌లో చిట్ చాట్ చేశాడు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం ఇచ్చాడు. కీర్తి సురేష్ సైతం తన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తోంది. కీర్తి సురేష్‌, నాని కలిసి చేసిన రీల్ వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. చమ్కీల అంగీలేసి అంటూ కీర్తి సురేష్‌, నాని కలిసి వేసిన స్టెప్పలు, దానికి సంబంధించిన రీల్ వీడియో బాగానే వైరల్ అయింది.

 

ఇప్పుడు రానాను తీసుకొచ్చి  ప్రమోషన్స్ చేశాడు నాని. దసరా సినిమాలో నాని రియల్‌గా మందేసి సీన్లలో నటించాడట. ఇక నాని ఈ సినిమాలో ఓ రకంగా మందు తాగుతాడు. ఎత్తితే దించని టైపులో నాని మందు కొట్టేశాడు. ఇలానే రానా కూడా నాని స్టైల్లో కల్లు తాగేశాడు. వీరిద్దరినీ చూసి కీర్తి సురేష్‌ కూడా ఎత్తిన సీసా దించకుండా గటగటా తాగేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?

Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News