Khushi Kapoor: బాలీవుడ్ లో రీమేక్ కానున్న తెలుగు రొమాంటిక్ మూవీ.. హీరోయిన్ గా శ్రీదేవి రెండో కూతురు!

Uppena: సినీ ఇండస్ట్రీలో రీమెక్స్ అనేవి కొత్తేమి కాదు.. సౌత్ నుంచి నార్త్ వరకు.. ఒక భాషలో హిట్ అయిన చిత్రాలను తిరిగి మిగిలిన భాషల్లో తీస్తూనే ఉంటారు. తాజాగా తెలుగులో సూపర్ హిట్ సాధించిన ఉప్పెన చిత్రం పై బాలీవుడ్ కన్నేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2024, 03:08 PM IST
Khushi Kapoor: బాలీవుడ్ లో రీమేక్ కానున్న తెలుగు రొమాంటిక్ మూవీ.. హీరోయిన్ గా శ్రీదేవి రెండో కూతురు!

Jhanvi Kapoor Sister: మెగా మేనల్లుడు వైష్ణవ తేజ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సెన్సేషనల్ మూవీ ఉప్పెన. వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. ఇందులో హీరోయిన్ గా చేసిన కృతిశెట్టి కి యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ పెరిగింది. ఎటువంటి అంచనాలు లేకుండా మామూలుగా వచ్చిన ఈ మూవీ థియేటర్ ని ఉప్పెనల ముంచేసింది..బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఉప్పెన మూవీ కరోనా సమయంలో విడుదలై 100 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఈ మూవీతో బుచ్చిబాబుకి కూడా డైరెక్టర్ గా టాలీవుడ్ మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయింది. కాగా ఇటీవల సౌత్ లో సాలిడ్ హిట్స్ సాధించిన చిత్రాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప్పెన మూవీ ని కూడా హిందీలో తీయబోతున్నారు.  కానీ ఇందులో ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాలో శ్రీదేవి కూతురు హీరోయిన్ గా కనిపించనుందట. ఈ మూవీలో కృతి శెట్టి పాత్రలో.. దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ చేయబోతోంది అని టాక్.

దేవర మూవీ తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న జాన్వీ.. ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా నటిస్తోంది.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ RC 16 మూవీ ఓపెనింగ్ కార్యక్రమానికి హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటు ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా వచ్చారు. అక్కడికి వచ్చిన గెస్ట్ లతో కాసేపు ముచ్చటించిన బోనీ కపూర్.. బుచ్చిబాబు ఉప్పెన సినిమా చూశాను.. కాన్సెప్ట్ నాకు ఎంతో బాగా నచ్చింది అని చెప్పారు. అంతేకాదు ఈ మూవీని త్వరలో హిందీలో రీమేక్ చేయడానికి ఆలోచిస్తున్నాను..మా ఖుషి ని కూడా ఈ మూవీ చూడమని చెప్పాను అని అన్నారట. 

సినిమా రీమేక్ చేస్తాము అన్నంతవరకు పర్లేదు.. కానీ అది పనిగా ఖుషి ని సినిమా చూడమని చెప్పడంలో బోనీ కపూర్ ఉద్దేశం ఏమిటి అని పలువురు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ లో రీమేక్ చేయబోయే ఉప్పెన మూవీకి హీరోయిన్ గా ఖుషి ని అనుకుంటున్నారని.. అందుకే ఆమె తండ్రి ఆమెను ఆ సినిమా చూడమని చెప్పి ఉంటారని కొందరు భావిస్తున్నారు. అయితే ఇందులో హీరోగా ఎవరిని తీసుకుంటారు అన్న విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ వార్త నిజమైతే.. ఉప్పెన తెలుగులో సాధించినంత సక్సెస్ బాలీవుడ్ లో కూడా సాధిస్తుందో లేదో చూడాలి.

Also Read: మేషరాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారి భవిష్యత్తు పూర్తిగా మారబోతోంది..

Also Read: కెమికల్స్ రహిత హోలి రంగులు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News