Kiara Advani Wedding : పెళ్లయ్యాక అలా కనిపించిన కియారా.. ఎయిర్ పోర్టులో సిద్దార్థ్ మల్హోత్ర సందడి

Kiara Advani Sidharth Malhotra Marriage కియారా అద్వాణి, సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి మంగళవారం నాడు జైసల్మీర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు జైసల్మీర్ నుంచి ఢిల్లీకి ఈ జంట వెళ్లినట్టుగా ఉంది. తాజాగా ఎయిర్ పోర్టులో కొత్త జంట సందడి చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2023, 06:15 PM IST
  • పెళ్లి తరువాత బయటకు వచ్చిన కొత్త జంట
  • ఎయిర్ పోర్టులో కియారా, సిద్దార్థ్ సందడి
  • చేతి నిండా మెహెందీతో కనిపించిన కియారా
Kiara Advani Wedding : పెళ్లయ్యాక అలా కనిపించిన కియారా.. ఎయిర్ పోర్టులో సిద్దార్థ్ మల్హోత్ర సందడి

Kiara Advani Snapped at Airport After Marraige కియారా అద్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రలు పెళ్లి అయిన తరువాత మొదటి సారిగా ఇలా ఎయిర్ పోర్టులో కనిపించారు. జైసల్మీర్ నుంచి ఢిల్లీకి వీరు బయల్దేరినట్టుగా కనిపిస్తోంది. ఇక ఎయిర్ పోర్టులో ఈ కొత్త జంట అందరికీ అభివందనం చేసింది. మీడియాను, కెమెరామెన్లను నవ్వుతూ పలకరించారు. కొత్త జంటలో ఆ వెలుగు కనిపిస్తోంది. కొత్త పెళ్లి కూతురి చేతి నిండా మెహెందీ కనిపిస్తోంది. కియారా, సిద్దార్థ్ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నేషనల్ వైడ్‌గా వైరల్ అవుతున్నాయి.

 

 

కియారా అద్వాణీ పెళ్లి వార్తలు గత వారం నుంచి వైరల్ అవుతూనే వచ్చాయి. నాలుగు, ఐదో తేదీల్లోనూ ఈవెంట్లు జరిగాయి. హల్దీ, సంగీత్ ఈవెంట్లకు సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సంగీత్ ఈవెంట్లో కియారా వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఫోటో షూట్ కోసం పెళ్లిని ఒక రోజు వాయిదా వేసినట్టుగా సమాచారం.

ఫిబ్రవరి 6న జరగాల్సిన పెళ్లిని ఫిబ్రవరి 7కి మార్చేశారు. మంగళవారం అంటే నిన్న కియారా సిద్దార్థ్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్‌ ఉపాసనలకు మాత్రమే ఇన్విటేషన్ వెళ్లినట్టుగా ఉంది. కానీ ఉపాసన, రామ్ చరణ్‌లు పెళ్లికి వెళ్లలేకపోయారట. అందుకే సారీ అంటూ ఉపాసన చేసిన కామెంట్ కూడా వైరల్ అయింది.

కియారా పెళ్లి వార్తలే కాకుండా.. పెళ్లి తరువాత కాపురం ఉండబోయే బంగ్లా గురించి హాట్ టాపిక్ అయింది. జుహు ఏరియాలోనే డెబ్బై కోట్లతో ఓ బంగ్లాను కొనేశారట. పెళ్లి తరువాత కొత్తగా కాపురం పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారట. అయితే ఇప్పుడు కియారా మాత్రం ఢిల్లీకి వెళ్లిందట.

ఎయిర్ పోర్టులో ఈ కొత్త జంట ఇలా కనిపించింది. అందరికీ హాయ్ చెబుతూ నవ్వులు చిందిస్తూ ఈ కొత్త జంట అందరినీ పలకరించింది. ప్రస్తుతం కియారా, సిద్దార్థ్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పెళ్లైన తెల్లారే ఇలా ఎయిర్ పోర్టులో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతోన్నారు.

Also Read:  Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు

Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News