Vijay Antony: ముగ్గురు ముద్దుగుమ్మలతో విజయ్ ఆంటోనీ కొత్త సినిమా

Vijay Antony: సంగీత దర్శకుడి నుంచి నటుడిగా మారిన విజయ్ ఆంటోనీ మరోసారి విలక్షణమైన చిత్రంతో మందుకొస్తున్నాడు. ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 26, 2022, 02:51 PM IST
Vijay Antony: ముగ్గురు ముద్దుగుమ్మలతో విజయ్ ఆంటోనీ కొత్త సినిమా

Vijay Antony: సంగీత దర్శకుడి నుంచి నటుడిగా మారిన విజయ్ ఆంటోనీ మరోసారి విలక్షణమైన చిత్రంతో మందుకొస్తున్నాడు. ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోనీ. సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించినా..నటుడిగా స్థిరపడ్డాడు. విలక్షణమైన కథాంశాలతో వచ్చే విజయ్ ఆంటోనీ చిత్రాలు మంచి కలెక్షన్లే సాధించాయి. ఇప్పుడు కొద్దికాలం విరామం అనంతరం మరో విలక్షణ చిత్రంతో ముుందుకొస్తున్నాడు.

విజయ్ ఆంటోనీ ( Vijay Antony) కొత్త చిత్రానికి రత్తం టైటిల్ ఖరారైంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్నాడు. ఇందులో మహిమా నంబియార్, నందిత శ్వేత, రమ్యా నంభీశన్ కథానాయికలుగా ఉన్నారు. ప్రముఖ హాస్య నటుడు జగన్ కృష్ణ ముఖ్యపాత్రలో కన్పించనున్నాడు. తమిళ్‌పడం చిత్రం ఫేమ్ సిఎస్ ఆముదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినమాకు గోపి అమర్‌నాథ్ కొరియోగ్రాఫర్ కాగా, కన్నన్ సంగీతం అందిస్తున్నారు. రాజకీయాలు నేపధ్యంగా సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఫిలిం వెంచర్స్ పతాకంపై నిర్మితం కానున్న ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. వేసవిలో విడుదలయ్యేందుకు సిద్ధమౌతోంది. 

Also read: Deepika Padukone Photos: రెడ్ డ్రస్సులో క్లీవేజ్ షో చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News