Kalki 2898AD: కల్కిలో కృష్ణుడుగా కనిపించింది ఎవరో తెలుసా? ఆ నటుడు ఎవరంటే

Lord Krishna in Kalki 2898 AD:  ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. తెరకెక్కిన కల్కి 2898 ఏడీ  సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో కృష్ణుడు పాత్రలో కనిపించిన నటుడి గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 28, 2024, 08:07 AM IST
Kalki 2898AD: కల్కిలో కృష్ణుడుగా కనిపించింది ఎవరో తెలుసా? ఆ నటుడు ఎవరంటే

Kalki 2898 AD
కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఎక్కువ సంఖ్యలో అతిథి పాత్రలు కనిపించి మెప్పించాయి. సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన.. ఈ చిత్రం ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ అభిమానులను సైతం మెప్పించడం గమనార్హం. 

కాగా ఈ సినిమా కథ మహాభారతంతో ముడి వేసి ఉండడంతో.. ఈ చిత్రంలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించగా.. అశ్వద్ధామగా.. అమితాబ్ బచ్చన్ కనిపించారు. ఇక ఈ చిత్రం మొదట్లో కనిపించిన కృష్ణుడి పాత్ర.. నటుడిని మాత్రం రివీల్ చేయలేదు సినిమా యూనిట్. దాంతో ఈ పాత్రలో నటించింది ఎవరు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు సాగాయి. అయితే ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో కనిపించింది మరెవరో కాదు.. కృష్ణ కుమార్. కృష్ణ కుమార్ ఒక తమిళ నటుడు. ఈయన ఇంతకుముందు చాలా మంచి పాత్రల్లో.. తమిళ సినిమాలలో.. నటించారు. సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రంలో.. ఒక ముఖ్య పాత్రలో కనిపించాడు. కాగా కల్కి చిత్రంలో అతని నటనకు వస్తున్న ప్రశంసల పట్ల.. సోషల్ మీడియాలో స్పందిస్తూ.. అతను సంతోషం వ్యక్తం చేశారు.

మరో పక్క ఏ చిత్రంలో కృష్ణుడి పాత్రకు డబ్బింగ్ చెప్పింది మాత్రం ప్రముఖ నటుడు అర్జున్ దాస్ కావడం గమనార్హం. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో.. తెరకెక్కిన సినిమాల ద్వారా ప్రశంసలు అందుకున్న అర్జున్ దాస్.. తన వాయిస్ తో ఈ సినిమాలో కృష్ణుడు పాత్రకు డైలాగ్స్ చెప్పి.. అందరినీ ఆకట్టుకున్నారు.

మరోపక్క ఈ సినిమా కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇలానే కొనసాగితే.. మరికొన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. సినీ విశ్లేషకులు చెబుతున్నాడు.  కల్కి 2898 ఏడీ సినిమా వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో.. థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఎన్నో రోజుల తర్వాత పెద్ద హీరో సినిమా థియేటర్స్ లో రావడంతో.. ఈ చిత్రానికి మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. కల్కి 2898 ఇతర భాషల్లో సైతం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News