కృష్ణార్జున యుద్ధం మూవీ రివ్యూ

వరుసగా 8 హిట్స్ కొట్టిన నాని ఖాతాలో ఇంకొక్క హిట్ పడితే ట్రిపుల్ హ్యాట్రిక్ అవుతుంది. 

Last Updated : Apr 12, 2018, 06:58 PM IST
  • > ‘దారి చూడు’, ‘ఐ వన్నా ఫ్లై’ సాంగ్స్
  • > బ్యాగ్రౌండ్ స్కోర్
  • > కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ
  • > సాంగ్స్ పిక్చరైజేషన్
  • > చిత్తూరు యాసలో డైలాగ్స్
  • > ప్రొడక్షన్ వ్యాల్యూస్
కృష్ణార్జున యుద్ధం మూవీ రివ్యూ

వరుసగా 8 హిట్స్ కొట్టిన నాని ఖాతాలో ఇంకొక్క హిట్ పడితే ట్రిపుల్ హ్యాట్రిక్ అవుతుంది. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇదొక అరుదైన రికార్డు అవుతుంది. అలాంటి అరుదైన రికార్డు కృష్ణార్జున యుద్ధం సినిమా సక్సెస్‌పై ఆధారపడింది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, నానికి ఆ స్పెషల్ రికార్డును అందించిందా అనేది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ :
చిత్తూరు జిల్లాలోని ఆకుర్తి అనే పల్లెటూరిలో ఫ్రెండ్స్‌తో సరదాగా ఎంజాయ్ చేస్తూ.. అప్పులు తీర్చడం కోసం పొలాల్లో డప్పు వాయించే కుర్రాడు కృష్ణ (నాని). యూరప్‌లో పెద్ద పాప్ సింగర్ అర్జున్ జయప్రకాశ్ (నాని). కృష్ణ ఊరి సర్పంచ్ (నాగినీడు) మనవరాలు ప్రియా (రుక్సర్ థిల్లాన్ ) మీద మనసు పారేసుకుంటాడు. మరోవైపు అక్కడ అర్జున్ మ్యాగ్జీన్ ఫోటోగ్రాఫర్ సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కట్ చేస్తే, చిత్తూరు నుండి ప్రియా, యూరోప్ నుండి సుబ్బలక్ష్మి హైదరాబాద్ వచ్చి కిడ్నాప్ అవుతారు. వాళ్ళను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన కృష్ణ, అర్జున్ తమ గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఉమెన్ ట్రాఫికింగ్‌కి గురయ్యారని తెలుసుకుంటారు. ఆ ముఠా నుండి వాళ్ళిద్దరినీ విడిపించడానికి కృష్ణార్జునులు ఒక్కటవుతారు. హైదరాబాద్‌లో ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తోన్న గ్యాంగ్ ఎవరు..? చివరికి ఆ గ్యాంగ్ నుండి కృష్ణ-అర్జున్ వారిద్దరితో పాటు మిగతా వారిని ఎలా కాపాడగలిగారు ? అనేదే మిగతా కథాంశం.

 

నటీనటుల పనితీరు:
ఇప్పటికే రెండు సినిమాల్లో డ్యూయెల్ రోల్స్ చేసి నటుడిగా మంచి మార్కులు అందుకున్న న్యాచురల్ స్టార్ నాని మరోసారి ద్విపాత్రాభినయంతో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా కృష్ణ అనే మాస్ క్యారెక్టర్‌లో జీవించాడు. చిత్తూరు జిల్లా యాసతో కృష్ణగా సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచాడు. రాక్‌స్టార్ అర్జున్ క్యారెక్టర్ ఇప్పటికే కొంత మంది హీరోలు చేశారు గనుక అదేమీ అంత కొత్తగా అనిపించదు. అనుపమ పరమేశ్వరన్ తన పర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్లస్ అయ్యింది. రుక్సర్ తన పాత్రకు తగినట్టుగా బెస్ట్ అనిపించుకుంది. బ్రహ్మాజీ, మహేష్, ప్రభాస్ శ్రీను తమ కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేశారు. ముఖ్యంగా చిత్తూరు యాసతో మహేష్ బాగా అలరించి సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. నాగినీడు, సుదర్శన్, హరితేజ మిగతా నటీనటులందరూ తమ క్యారెక్టర్స్‌తో ఓకే అనిపించారు.
 
టెక్నీషియన్స్ పనితీరు :
‘ధృవ’తో మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హిప్ హాప్ తమీజా ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచారు. ‘దారి చూడు’, ‘ఐ వన్నా ఫ్లై’ సాంగ్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో బ్యాగ్రౌండ్ స్కోర్  కీలక పాత్ర పోషించింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్, కొన్ని సీన్స్‌లో కార్తీక్ తన కెమెరా పనితనం చూపించాడు. చిత్తూరు యాసతో కూడిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పరవాలేదు. కానీ ఫస్ట్ హాఫ్‌లో ఇంకాస్త ట్రిమ్ చేయొచ్చు. మేర్లపాక గాంధీ కథ -స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయాయి. ఫస్ట్ మూవీ అయినప్పటికీ నిర్మాతలు బాగా ఖర్చుపెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

వరుసపెట్టి హిట్స్ కొడుతున్న నాని స్టోరీ సెలక్షన్‌లో కింగ్ అనిపించుకున్నాడు. సో.. న్యాచురల్ స్టార్ నుంచి ప్రామిసింగ్ మూవీ వస్తుందనేది అతడి అభిమానులకు ఎప్పుడో అర్థమైపోయింది. ఇలాంటి హీరోకు, మేజికల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు యాడ్ అయ్యాడు. పైగా నాని డ్యూయల్ రోల్. కృష్ణార్జున యుద్ధం అనే టైటిల్ ఎంతో క్యాచీగానూ వుంది. ఇలా అన్నీ యాడ్ అవ్వడంతో ఈ సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. కానీ ఆ బజ్‌ను యాజ్ ఇటీజ్‌గా సినిమాలో మాత్రం క్యారీ చేయలేకపోయారనిపించింది.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాల్లో ఓ మేజిక్ కనిపిస్తుంది. క్యారెక్టర్స్ నెరేషన్‌తో పాటు స్క్రీన్ ప్లేలో జిమ్మిక్కులే ఆ సినిమాల్ని హిట్ చేశాయి. సరిగ్గా ఇవే ఎలిమెంట్స్ కృష్ణార్జున యుద్ధంలో మిస్ అయ్యాయి. కృష్ణ పాత్రపై పెట్టిన శ్రద్ధ, సెకెండాఫ్ నెరేషన్ మీద పెట్టి ఉంటే సినిమా నెక్ట్స్ లెవెల్‌లో ఉండేది. దర్శకుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి (రేణిగుంట) కావడంతో ఆ యాసతో అక్కడి క్యారెక్టర్స్‌తో కొంత వరకూ ఎంటర్‌టైన్ చేశాడు. కానీ పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్‌లో రెండు క్యారెక్టర్‌‌ల మధ్య నడిచే కథను ఎంటర్‌టైనింగ్‌గా చూపించి పరవాలేదనిపించిన గాంధీ, సెకండ్ హాఫ్‌లో రొటీన్ అనిపించే ఉమెన్ ట్రాఫికింగ్ ఎలిమెంట్, స్క్రీన్‌ప్లేతో బోర్ కొట్టించాడు.

ఇక నాని విషయానికొస్తే, ఎలాంటి పాత్రనైనా తన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో పీక్స్‌కు తీసుకెళ్లగలడు. సినిమాలో కృష్ణ క్యారెక్టర్ అంతలా క్లిక్ అయిందంటే దానికి కారణం నాని ప్రజెన్స్. కృష్ణ పాత్రతో సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించాడు నాని. కానీ కేవలం ఈ క్యారెక్టర్‌తో, కాసింత ఎంటర్టైన్‌మెంట్‌తో నాని ఈ సినిమాను హిట్ రేంజ్‌కి తీసుకెళ్లగలడా అనేది డౌట్. ఒకవేళ అదే కనుక జరిగితే నాని కచ్చితంగా క్రౌడ్ పుల్లరే. ఎందుకంటే ఇందులో స్టోరీ లేదు. కేవలం నాని మేజిక్‌తో నడవాల్సిన సినిమా ఇది.

కృష్ణగా నాని పెర్ఫార్మెన్స్, రుక్సర్ గ్లామర్, రెండు పాటలు, అక్కడక్కడ చిత్తూరు యాసతో వచ్చే కామెడి డైలాగులు, బ్రహ్మాజీ కామెడి, బాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలైట్ అనిపిస్తాయి. రొటీన్ స్టోరీ-స్క్రీన్ ప్లే, స్లో నేరేషన్, కథను మరీ సాగదీసినట్టు అనిపించడం సినిమాకు మైనస్. ఫైనల్‌గా కృష్ణ క్యారెక్టర్, కామెడి కోసం ఈ యుద్ధాన్ని ఒకసారి చూడొచ్చు.

రేటింగ్ :  2.75/5

జీ సినిమాలు సౌజన్యంతో కృష్ణార్జున యుద్ధం మూవీ రివ్యూ.. 

Trending News