Dheera: ఆకట్టుకుంటున్న‘ధీర’ మేకింగ్ వీడియో ..సూపర్ హిట్ కి సిద్ధమైన లక్ష్ చదలవాడ

Dheera Making Video: హీరో, హీరోయిన్లతో సంబంధం లేకుండా సినిమా కథ బాగుంటే సూపర్ హిట్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం అందరిని అలా కథతో ఆకట్టుకోవడానికి వస్తూన్న సినిమా ధీర..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2024, 11:49 AM IST
Dheera: ఆకట్టుకుంటున్న‘ధీర’ మేకింగ్ వీడియో ..సూపర్ హిట్ కి సిద్ధమైన లక్ష్ చదలవాడ

Dheera: యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. అలాంటి తెలుగు ప్రేక్షకులకు పక్కా కమర్షియల్ సినిమా అందించడానికి..లక్ష్ చదలవాడ ప్రస్తుతం ‘ధీర’ అనే మంచి సబ్జెక్టుతో రాబోతున్నారు.   వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి విజయవంతమైన చిత్రాల తరువాత లక్ష్ మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు సిద్దంగా ఉన్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.  

ధీర గ్లింప్స్, టీజర్‌ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేశాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానిపై మేకింగ్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేశారు ఈ సినిమా యూనిట్. ఈ చిత్రం ఎవరు షూటింగ్ స్పాట్‌లో యూనిట్ ఎంత సరదాగా ఉందో.. ఎంత కష్టపడి చిత్రీకరణ చేశారో చూపించేలా వదిలిన ఈ మేకింగ్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో యూట్యూబ్లో సైతం తెగ వైరల్ అవుతుంది.

ధీర మూవీ షూటింగ్ పూర్తయింది. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అలానే సెన్సార్ పనులు కూడా పూర్తవ్వడంతో ఈ చిత్ర యూనిట్ ఈ సినిమాని ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల చెయ్యబోతున్నారు. ఈ సినిమాలో లక్ష్ చదలవాడ, నేహా పఠాన్ హీరో హీరోయిన్ల గా నటిస్తుండగా.. సోనియా బన్సాల్,సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్,  మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. కన్నా పీసీ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా వినయ్ రామస్వామి ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్

Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News