Uppena teaser : రేపు సాయంత్రం తీరాన్ని తాకనున్న ఉప్పెన టీజర్

Uppena teaser : నీ కళ్లు నీలి సముద్రం..ఇప్పటికే ఓ సెన్సేషన్ అయిన పాట. సినిమా విడుదలకు ముందే చాలాకాలం నుంచి ప్రజల నోళ్లలో నానుతున్న పాట ఇది. ఈ సినిమా టీజర్ రేపు విడుదల కానుంది.

Last Updated : Jan 12, 2021, 09:02 PM IST
Uppena teaser : రేపు సాయంత్రం తీరాన్ని తాకనున్న ఉప్పెన టీజర్

Uppena teaser : నీ కళ్లు నీలి సముద్రం..ఇప్పటికే ఓ సెన్సేషన్ అయిన పాట. సినిమా విడుదలకు ముందే చాలాకాలం నుంచి ప్రజల నోళ్లలో నానుతున్న పాట ఇది. ఈ సినిమా టీజర్ రేపు విడుదల కానుంది.

ఉప్పెన ( Uppena )..సినిమా పేరు వినగానే గుర్తొచ్చే పాట నీ కళ్లు నీలి సముద్రం ( Nee kallu neeli samudram song )..చక్కని సాహిత్యం, అంతకుమించిన ట్యూన్ తో అలవోకగా అందరికీ నచ్చి..అందరి నోళ్లలో నానుతున్న పాట ఇది. టాలీవుడ్ నటుడు ( Tollywood actor ) సాయిధరమ్ తేజ్ ( Sai dharam tej ) సోదరుడైన వైష్ణవ్ తేజ్ ( Vaishnav tej ) డెబ్యూట్ మూవీ ఇది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన సినిమా వాస్తవానికి గత ఏడాదే ప్రేక్షకుల ముందు రావల్సింది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. విడుదల కాకుండానే పాటలతో సినిమా రేంజ్ పెరిగిపోయింది.

ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ గుడ్ న్యూస్. ఉప్పెన టీజర్  ( Uppena teaser ) విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 13వ తేదీ అంటే రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు టీజర్ తీరాన్ని తాకనుందని తెలుస్తోంది. 

మంగళురు భామ కృతిశెట్టి ఉప్పెనతో తెలుగు పరిశ్రమకు పరిచయమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వేసవి కానుకగా విడుదల చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ( Devisri prasad ) మ్యూజిక్ ప్రత్యేకమైన హైలైట్ అని ఇప్పటికి రుజువైంది. 

Also read: Zombie Reddy: జాంబి రెడ్డి రిలీజ్ డేట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News