Love Me Release Date: ఆశిష్, బేబి భామ వైష్ణవి చైతన్యల హారర్ థ్రిల్లర్ ‘లవ్ మీ’ మూవీ.. ఏప్రిల్ 25న విడుదల..

Love Me Release Date: టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్ హీరోగా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటించిన సినిమా 'లవ్ మీ'.  శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.

Last Updated : Mar 24, 2024, 03:51 PM IST
Love Me Release Date: ఆశిష్, బేబి భామ వైష్ణవి చైతన్యల  హారర్ థ్రిల్లర్ ‘లవ్ మీ’ మూవీ.. ఏప్రిల్ 25న విడుదల..

Love Me Release Date: ఈ మధ్యకాలంలో దిల్ రాజు పెద్ద సినిమాలనే కాదు.. చిన్న సినిమాలను సైతం నిర్మిస్తోంది. ఈ కోవలో వస్తోన్న మరో లవబుల్ చిత్రం 'లవ్ మీ'. 'ఇఫ్ యూ డేర్' అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టీజర్ కు అమేజింగ్ రెస్పాన్స్ రావటమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు పెరిగాయి. లవ్ మీ- ఇఫ్ యు డేర్’ టీజర్‌ను గమనిస్తే కట్టిపడేసే కథనంతో పాటు వెన్నులో భయాన్ని కలిగించే హారర్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. ఇది ప్రేక్షకులకు మరచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుందని టీజర్ చూసిన వారందరూ చెబుతున్నారు. బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఓ కుర్రాడు, దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది.. ఏమవుతుంది.. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న చిత్రం ‘లవ్ మీ’. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. .

ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. స్టార్ టెక్నీషియన్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.నటీనటులు : ఆశిష్, వైష్ణవి చైతన్య తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్
హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు : అరుణ్ భీమవరపు, కెమెరామెన్ : పీసీ శ్రీరామ్, సంగీతం : కీరవాణి, ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి.

ఈ సినిమాను నిర్మిస్తోన్న దిల్ రాజు విషయానికొస్తే.. త్వరలోనే ఈయన 'ఫ్యామిలీ స్టార్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు.. రామ్ చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్' మూవీ తెరకెక్కిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదల తేదిని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేయనున్నారు.

Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x