Love Story prerelease event: లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో Chiranjeevi సెన్సేషనల్ కామెంట్స్

Chiranjeevi sensational comments on AP govt and TS govt: తెలుగు సినిమా టికెట్లను ప్రభుత్వ అధికారిక పోర్టల్ ద్వారా విక్రయించనున్నట్టు ఇటీవలే ఏపీ సర్కారు (AP govt to sale cinema tickets) ప్రకటించిన కొద్ది రోజులకే మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తినిరేకెత్తిస్తోంది.

Written by - Pavan | Last Updated : Sep 20, 2021, 07:36 AM IST
Love Story prerelease event: లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో Chiranjeevi సెన్సేషనల్ కామెంట్స్

Chiranjeevi sensational comments on AP govt and TS govt: తెలుగు సినీ పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో ఉందని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు సినీ పరిశ్రమను ఆదుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి.. ఇదే వేదికపై నుంచి టాలీవుడ్ కష్టాలను ప్రభుత్వాలకు వివరించారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా తెలుగు సినీ పరిశ్రమ (Telugu film industry) ఎంతో నష్టపోయిందన్న చిరంజీవి.. పరిశ్రమనే నమ్ముకున్న కళాకారులు, కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

తెలుగు సినీ పరిశ్రమలో పని చేసే వాళ్లంతా భారీ సంపాదన ఉన్న వాళ్లు కాదు. నలుగురైదుగురు హీరోలు, డైరెక్టర్లు తప్ప మిగతా వాళ్లంతా తక్కువ పారితోషికం తీసుకునే వాళ్లే. ఎక్కువ పారితోషికం తీసుకునే నలుగురైదుగురిని దృష్టిలో పెట్టుకుని మిగతా వాళ్లను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నానని చిరంజీవి అన్నారు. ''ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం సినిమా బడ్జెట్ భారీగా పెరుగుతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ అందుకు తగినట్టుగా నిర్మాతలకు ఆదాయం రావడం లేదు. ఇలాంటి సమయంలో సినిమా వాళ్లను ఇబ్బంది పెట్టేలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోకూడదు'' అని చిరంజీవి (Chiranjeevi) రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 

Also read : Chiranjeevi: 'సాయిపల్లవి నా సినిమా రిజక్ట్ చేసినందుకు సంతోషించా'..చిరంజీవి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినిమా టికెట్లను ప్రభుత్వ అధికారిక పోర్టల్ ద్వారా విక్రయించనున్నట్టు ఇటీవలే ఏపీ సర్కారు (AP govt to sale cinema tickets) ప్రకటించిన కొద్ది రోజులకే మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తినిరేకెత్తిస్తోంది. ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరంజీవి (Chiranjeevi) ఇలా అన్నారంటే ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పరోక్షంగా వ్యతిరేకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇదిలావుంటే, లవ్ స్టోరీ మూవీ (Love story movie trailer) గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి.. తాను ఆ సినిమాను రెండు, మూడుసార్లు చూడాలని భావిస్తున్నట్టు తెలిపారు. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ (Aamir Khan) చీఫ్ గెస్ట్‌గా హాజరైన లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కరోనా తర్వాత బిగ్గెస్ట్ ఈవెంట్‌గా నిలిచింది.

Also read : MaheshBabu, NTR in EMK event : ఎన్టీఆర్‌‌ షోలో రాజమౌళి, కొరటాల శివ సందడి.. నెక్ట్స్‌ మహేశ్‌బాబు అని టాక్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News