Movies this Week: మారేడుమిల్లి ప్రజానీకానికి డబ్బింగ్ సినిమాల టెన్షన్.. 'తోడేలు, లవ్ టుడే' ఏం చేస్తాయో?

Dubbing Movies Dominating Maredumilli Prajaaneekam: తమిళం నుంచి తెలుగుకు వస్తున్న లవ్ టుడే, హిందీ నుంచి తెలుగుకు వస్తున్న తోడేలు సినిమాలు ఇప్పుడు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాకు గట్టిపోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది, ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 21, 2022, 09:15 AM IST
Movies this Week: మారేడుమిల్లి ప్రజానీకానికి డబ్బింగ్ సినిమాల టెన్షన్.. 'తోడేలు, లవ్ టుడే' ఏం చేస్తాయో?

Love Today - Thodelu Movies Dominating Maredumilli Prajaaneekam: సంక్రాంతికి డైరెక్ట్ తెలుగు సినిమాలు డబ్బింగ్ సినిమాలు అంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ శుక్రవారం కూడా రిలీజ్ కాబోతున్న సినిమాల విషయంలో అదే రకమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. నవంబర్ 25వ తేదీన మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. అల్లరి నరేష్ హీరోగా నటించిన మారేడు మల్లి ప్రజానీకం అనే సినిమా నవంబర్ 25వ తేదీన విడుదలవుతోంది.

వీటితో పాటుగా దిల్ రాజు రిలీజ్ చేస్తున్న లవ్ టుడే అనే తమిళ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. అక్కడ సుమారు 50 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు దిల్ రాజు. అదే రోజున అల్లు అరవింద్ కాంపౌండ్ నుంచి తోడేలు సినిమా కూడా వస్తోంది. హిందీలో వరుణ్ ధావన్, కృతి సనన్ హీరోగా ప్రతి సనన్ హీరోయిన్ గా భేడియా పేరుతో రిలీజ్ అవుతున్న సినిమాని తెలుగులో తోడేలు పేరుతో అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలకి పెద్ద ఎత్తున థియేటర్లు కేటాయిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ దెబ్బతో డైరెక్ట్ ఫిలిం అయిన మారేడుమల్లి ప్రజానీకం సినిమాకి థియేటర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోందని వాదన వినిపిస్తోంది. ఈ నేపద్యంలో అల్లు అరవింద్ దిల్ రాజును సపోర్ట్ చేస్తూ చేసిన కామెంట్స్ గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు. సరిగ్గా ఒకటి రెండు రోజుల క్రితం ఈ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ విషయంలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక లేఖ విడుదల చేసింది కదా అని ప్రశ్నిస్తే అవేమీ జరిగే పని కాదు అంటూ అల్లు అరవింద్ కామెంట్ చేశారు.

సంక్రాంతికి ఎదురు కావాల్సిన పరిస్థితి ఈసారి ఏకంగా నవంబర్ 25వ తేదీ శుక్రవారం నాడు ఎదురు కాబోతోందనే వాదన వినిపిస్తోంది. ఇక ఈ బరిలో దిగుతున్న మూడు సినిమాల్లో ఏది నిలబడుతుందో చూడాలి. ఇక ఇవి కాక మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా అదే రోజున విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.

Also Read: Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం.. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా ఎంపిక!

Also Read: Prasanna Kumar: మేమలా అనలేదు, వారసుడు వివాదంపై పెదవి విప్పిన ప్రసన్న కుమార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News