Mahesh Babu: ఆ విషయంలో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన మహేష్ బాబు.. సూపర్ స్టారా.. మజాకా..

Mahesh Babu: గత కొన్నేళ్లుగా తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ ఉండేది. ఈ మధ్య వాటి జోరు తగ్గినట్టు కనిపించింది. కానీ రీసెంట్ గా మహేష్ బాబు హీరోగా నటించిన ‘మురారి’ సినిమాతో మళ్లీ అది పీక్స్ కు చేరింది. అంతేకాదు ఈ సినిమా రీ రిలీజ్ లో సరికొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 22, 2024, 01:18 PM IST
Mahesh Babu: ఆ విషయంలో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన మహేష్ బాబు.. సూపర్ స్టారా.. మజాకా..

Mahesh Babu: గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో  ఓల్డ్ క్లాసిక్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఎక్కువపోయాయి. ఆల్రెడీ ఓటీటీ, యూట్యూబ్ లో చూసేసిన చిత్రాలను మళ్లీ థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య హీరోల బర్త్ డేల సందర్భంగా రీ రిలీజ్ చేసిన సినిమాలకు అంతగా రెస్పాన్స్ రాలేదు. కానీ మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా రీ రిలీజైన ‘మురారి’ సినిమా రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అంతేకాదు ‘మురారి’ చిత్రం తొలి రోజు రీ రిలీజ్ లో రూ. 5.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి ఔరా అనిపించింది.

ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ చిత్రాల మొదటి రోజు వసూళ్ల కంటే ‘మురారి’ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ రావడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే..
నైజాం (తెలంగాణ).. రూ. 5.01 కోట్ల గ్రాస్
సీడెడ్ (రాయలసీమ).. రూ. 0.54 కోట్ల గ్రాస్
ఆంధ్ర ప్రదేశ్ .. రూ. 1.85 కోట్ల గ్రాస్
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 7.39 కోట్ల గ్రాస్ కలెక్షన్స్..
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి.. రూ. 0.69 కోట్ల గ్రాస్
ఓవర్సీస్.. రూ. 0.81 కోట్ల గ్రాస్
ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.90 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అంతేకాదు తెలుగులో రీ రిలీజ్ మూవీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మహేష్ బాబు ‘మురారి’ సినిమా సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం విశేషం.

టాలీవుడ్ లో  రీ రిలీజ్ లపై ఇంట్రెస్టింగ్ తగ్గుతున్న ఈ టైమ్ లో మురారి సినిమా తెలుగులో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పటి వరకు రీ రిలీజ్ లో తెలుగులో ఖుషీ మూవీ రూ. 7.46 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను క్రాస్ చేయడం విశేషం. ‘మురారి’ సినిమా విషయానికొస్తే.. మహేష్ బాబు హీరోగా నటించిన  4వ చిత్రం. కృష్ణవంశీ దర్శకత్వంలో కృష్ణతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎన్.రామలింగేశ్వరావు  ఈ సినిమాను నిర్మించారు.  ‘మురారి’ సినిమా 2001 ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా విడుదలై సక్సెస్ అందుకుంది. దాదాపు 23 యేళ్ల తర్వాత రీ రిలీజైన ఈ సినిమా ఇపుడు కూడా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించింది.  

ఒక ఫ్యామిలీకి సంబంధించిన శాపం నేపథ్యంలో కృష్ణవంశీ ఈ చిత్రాన్ని ఎంతో రీసెర్చి చేసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.  ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. అంతేకాదు మహేష్ కెరీర్ లోనే మురారి ఫస్ట్  బ్లాక్ బస్టర్ అని చెప్పాలి.  ఈ చిత్రానికి మణిశర్మ అందించిన బాణీలు చక్కగా కుదిరాయి. మరోవైపు హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో ‘మురారి’ సినిమా 175 రోజులకు పైగా నడిచి రికార్డు క్రియేట్ చేసింది. మహేష్ బాబు కెరీర్ లో తొలి రజతోత్సవం మూవీగా నిలిచింది.  ఆ తర్వాత సుదర్శన్ 35 ఎంఎంలో ‘అతడు’, పోకిరి’ సినిమాలు కూడా  సిల్వర్ జూబ్లీ  పూర్తి చేసుకోవడం విశేషం.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News