Ramesh Babu cremation: రమేష్ బాబు అంత్యక్రియలకు తమ్ముడు మహేష్ బాబు దూరం!

Ramesh Babu cremation: సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు అంత్యక్రియలు జూబ్లీహిల్స్​ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. అయితే సోదరుడి అంత్యక్రియలకు మహేశ్ బాబు దూరంకానున్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 12:02 PM IST
  • కాలేయ వ్యాధితో రమేష్ బాబు మృతి
  • జూబ్లీహిల్స్​ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • దూరం కానున్న సూపర్ స్టార్ మహేశ్
Ramesh Babu cremation: రమేష్ బాబు అంత్యక్రియలకు తమ్ముడు మహేష్ బాబు దూరం!

Ramesh Babu cremation: సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్‌బాబు అన్నయ్య ఘట్టమనేని రమేష్‌బాబు (56) (Ramesh Babu) ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు జూబ్లీహిల్స్​ మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు (Ramesh Babu cremation)నిర్వహించనున్నారు. ఏఐజీ ఆస్పత్రిలో (Gachibowli AIG Hospital) ఉన్న రమేశ్​ భౌతికకాయాన్ని.. కుటుంబసభ్యుల సందర్శనార్థం మరికాసేపట్లో పద్మాలయ స్టూడియోకు తరలించనున్నారు.  ఆయన మృతిపట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

అంత్యక్రియల సమయంలో అభిమానులు గుమికూడకుండా... ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది ఘట్టమనేని కుటుంబం (Ghattamaneni family). అయితే సోదరుడి అంత్యక్రియలకు మహేశ్ బాబు (Mahesh Babu) రాలేకపోతున్నారు. దీనికి కారణం ఆయన కరోనా బారినపడటమే. జనవరి 7న మహేశ్ కు కొవిడ్ (Covid-19) పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ కారణంగానే అన్న రమేశ్ బాబు అంత్యక్రియలకు మహేశ్ దూరం కానున్నాడు. 

Also Read: Breaking News: సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి

'అల్లూరి సీతారామరాజు' (1974) ((Alluri Seetharamaraju) చిత్రం ద్వారా రమేశ్​బాబు వెండితెర ప్రవేశం చేశారు. కృష్ణ (Super Star Krishna), మహేశ్‌బాబుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. సుమారు 15 చిత్రాల్లో ఆయన కీలకపాత్రలో పోషించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్‌బాబు 2004లో నిర్మాతగా మారారు. 'అర్జున్‌', 'అతిథి' సినిమాలు నిర్మించారు.

Also Read: Ramesh Babu: రమేష్ బాబు నటనకు ఎందుకు దూరమయ్యారు.. హీరోగా ఎందుకు విఫలమయ్యారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News