Nedumudi Venu: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం...జాతీయ అవార్డు గ్రహీత నెడుముడి వేణు మృతి

Nedumudi Venu:  లెజండరీ మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత నెడిముడి వేణు(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2021, 07:16 PM IST
  • సినీ ఇండస్ట్రీలో విషాదం
  • జాతీయ అవార్డు గ్రహీత నెడుముడి వేణు మృతి
  • పలువురు సంతాపం
Nedumudi Venu: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం...జాతీయ అవార్డు గ్రహీత నెడుముడి వేణు మృతి

Nedumudi Venu: సినీ పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత, స్క్రీన్ రైటర్ నెడిముడి వేణు(73) కన్నుమూశారు.మలయాళ, తమిళ భాషల్లో కలిపి 500లకు పైగా చిత్రాల్లో నటించారు. అత్యధిక చిత్రాలు మలయాళం(Malayalam)లోనే చేశారు. 

శంకర్ చిత్రాలతో గుర్తింపు..
కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆదివారం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. నాటక కళాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన వేణు(Nedumudi Venu) 1978లో వచ్చిన ‘తంబు’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘అరవం’, ‘ఒడిత్తరు పహిల్వాన్‌’, ‘కల్లాన్‌ పవిత్రన్‌’ తదితర చిత్రాలు ఆయన కెరీర్‌ను మలుపు తిప్పాయి. పలు చిత్రాలకు ఆయన స్క్రీన్‌ రైటర్‌గానూ పనిచేశారు. ‘పూరమ్‌’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’, అపరిచితుడు’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

Also Read: Satyajith Passed Away: ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ

మూడు నేషనల్‌ అవార్డులు
నెడిముడి వేణు కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. అందులో మూడు జాతీయ అవార్డులు(National Award Winner) ఉండటం గమనార్హం. ‘హిస్‌ హైనెస్‌ అబ్దుల్లా’ చిత్రంలో నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ‘మార్గం’ చిత్రానికి స్పెషల్‌ జ్యూరీ రాగా, ‘మినుక్కు’కు జాతీయ ఉత్తమ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ నెరేషన్‌/వాయిస్‌ ఓవర్‌ అవార్డు వచ్చింది.

ఉత్తమ నటుడిగా మూడుసార్లు కేరళ స్టేట్‌ అవార్డు(Kerala State Award) అందుకున్నారు. ఇక రెండు సార్లు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌, లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. నెడిముడి వేణు మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్‌ పార్వతిలతో పాటు మలయాళం, తమిళ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News