Model Shahana Kerala: పుట్టినరోజే మృత్యువు ఒడిలోకి నటి.. భర్తపై అనుమానాలు!

Malayalam Model Shahana died on her birthday. కేరళకు చెందిన ప్రముఖ మోడల్‌, నటి షహానా గురువారం (మే 12) అనుమానాస్పద స్థితిలో కన్నుమూసారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 07:15 PM IST
  • పుట్టినరోజే మృత్యువు ఒడిలోకి నటి
  • భర్తపై అనుమానాలు
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
Model Shahana Kerala: పుట్టినరోజే మృత్యువు ఒడిలోకి నటి.. భర్తపై అనుమానాలు!

Malayalam Model Shahana died on her birthday in Kozhikode: కేరళకు చెందిన ప్రముఖ మోడల్‌, నటి షహానా అనుమానాస్పద స్థితిలో కన్నుమూసారు. గురువారం (మే 12) కాసర్‌ఘడ్‌లోని తన నివాసంలో 21వ పుట్టినరోజు జరుపుకున్న షహానా.. ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. అర్ధరాత్రి ఒంటి గంటకు షహానా చనిపోయిందంటూ తన కుటుంబీకులకు ఫోన్‌ వచ్చింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన షహానా కుటుంబీకులు ఆమె చావుకు భర్త సజ్జద్‌ కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సజ్జద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

షహానాకు 2021లో సజ్జద్‌తో వివాహం అయింది. అందం, అభినయం ఉన్న షహానా.. 20 ఏళ్ల చిన్న వయస్సు లోనే మోడలింగ్‌ రంగంలో తనదైన ముద్ర వేశారు. వివాహం అనంతరం షహానా, సజ్జద్‌ మధ్య విబేధాలు వచ్చాయి. భర్త నుంచి తనకు ప్రాణహానీ ఉందని తల్లిదండ్రులకు ఆమె చాలాసార్లు ఫిర్యాదు చేశారు. చివరకు షహానా బాత్రూమ్‌లో శవమై కనిపించడంతో.. సజ్జద్‌ చిత్రహింసలు పెట్టినట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దాంతో సజ్జద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షహానా ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

షహానా తల్లి మాట్లాడుతూ... 'నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు. ఆమెను చంపేశారు. అత్తారింట్లో తనను టార్చర్‌ పెడుతున్నారని చాలాసార్లు చెప్పింది. సజ్జద్‌ తాగొచ్చి నానా గొడవ చేసేవాడు. అతడి తల్లిదండ్రులు, సోదరి కూడా షహానాకి నరకం చూపించేవారు. దాంతో వేరు కాపురం పెట్టమని సూచించాను. ఇంటి నుంచి బయటకు వచ్చేసి అద్దెంట్లో ఉంటున్నారు. సజ్జద్‌ డబ్బు కోసం గొడవ చేస్తున్నాడని, దారుణంగా ప్రవర్తిస్తున్నాడని షహానా నాకు చెప్పింది. 25 సవర్ల బంగారాన్ని మాయం చేశాడు. పుట్టినరోజు మమ్మల్ని కలవాలనుకున్నా.. అందుకు అతడు ఒప్పుకోలేదు. రాత్రే షహానా చనిపోయింది' అని బోరున ఏడ్చేశారు. 

ఏసీపీ కె సుదర్శన్‌ మాట్లాడుతూ... 'షహానా తమిళ ప్రాజెక్టులో నటించినందుకు పారితోషికం ఇచ్చారు. ఆ డబ్బుల కోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. షహానా బర్త్‌డే రోజు కూడా సజ్జద్‌ ఆలస్యంగా వచ్చాడట. దాంతో ఇద్దరు మరోసారి తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. ఆ తర్వాత బాత్రూమ్‌లో షహానా శవమై కనిపించింది. షహానా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సజ్జద్‌ను అదుపులోకి తీసుకున్నాం. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్నది దర్యాప్తు చేస్తున్నాం' అని చెప్పారు.

Also Read: Nani-Nazriya Nazim: నాని, న‌జ్రియా ఫ‌న్నీ ఛాలెంజ్.. వీడియో చూస్తే నవ్వులే!

Also Read: MS Dhoni Retire: ఐపీఎల్ 2022 తర్వాత ఎంఎస్ ధోనీ రిటైర్ అవుతాడా?.. సునీల్ గవాస్కర్ ఏం చెప్పారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News