Manchu Vishnu: తమ్ముడు పెళ్లికి అతిథిగా వచ్చి వెళ్లిపోయిన మంచు విష్ణు..టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చ!

Manchu Vishnu at Manchu Manoj Marriage: సోదరుడి వివాహం అంటే అన్నీ తానే అయి వ్యవహరించాల్సిన మంచు విష్ణు ఇంటికి వచ్చి కొద్దిసేపు కూడా గడవకుండానే వెంటనే వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 3, 2023, 09:57 PM IST
Manchu Vishnu: తమ్ముడు పెళ్లికి అతిథిగా వచ్చి వెళ్లిపోయిన మంచు విష్ణు..టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చ!

Manchu Vishnu Courtesy Visit to Manchu Manoj Marriage: మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు విష్ణు ఎట్టకేలకు రెండో వివాహం చేసుకున్నారు. ఈ రోజు ఆయన వివాహం జరగబోతుందని ముందు నుంచే పెద్ద ఎత్తున ప్రచారం జరగకుండా ఈరోజు ఉదయం తాను వివాహం చేసుకోబోతున్న అమ్మాయి ఫోటోను షేర్ చేస్తూ పెళ్లికూతురు అంటూ మంచు మనోజ్ కామెంట్ పెట్టడంతో ఆయన వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక హైదరాబాదులోని ఫిలింనగర్ లో మంచు లక్ష్మీ నివాసంలో మంచు మనోజ్ వివాహం ఘనంగా జరిగింది.

ఏపీలోని ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన కీలక నేత, దివంగత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె అయిన భూమా నాగమౌనికను మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. మంచు మనోజ్ కి ఇది రెండో వివాహం కాగా నాగ మౌనికకు కూడా ఇది రెండో వివాహమే. ఇక వీరి పెళ్లికి మోహన్ బాబు రాకపోవచ్చు అని ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు మోహన్ బాబు కనిపించలేదు కానీ వీరి వివాహానికి హాజరైన మంచు విష్ణు కూడా చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంద.

సాధారణంగా సోదరుడి వివాహం అంటే అన్నీ తానే అయి వ్యవహరించాల్సిన మంచు విష్ణు ఇంటికి వచ్చి కొద్దిసేపు కూడా గడవకుండానే వెంటనే తన కుమారుడిని, కుమార్తెలను తీసుకుని వెనక్కి వెళ్ళి పోయినట్లు తెలుస్తోంది. దీంతో అంశం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది అయితే మంచు మనోజ్ భూమా నాగ మౌనిక వివాహం చేసుకున్న సందర్భంగా మంచు మనోజ్ అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి వివాహం ఎలాగో చెడిపోయింది రెండో వివాహం అయినా కలకాలం కలిసి ఉండాలంటూ వారు కామెంట్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఫిలింనగర్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఒకప్పుడు మోహన్ బాబు అదే నివాసంలో ఉండేవారు కానీ ఇప్పుడు ఆయన శంషాబాద్ నివాసానికి మారిపోయిన నేపథ్యంలో మంచు లక్ష్మి ఒక్కరే అక్కడ నివసిస్తున్నారు. ఇక ఆమె నివాసంలోనే మంచు మనోజ్ వివాహం జరిగింది. మంచు విష్ణు చుట్టం చూపుగా ఎందుకు వెళ్లిపోయారు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Also Read: Organic Mama Hybrid Alludu Review: ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు రివ్యూ.. మామా అల్లుళ్లు హిట్ కొట్టారా?

Also Read: Shruti Haasan Photos: వర్కౌట్లలో చిలిపి పనులు చేస్తున్న శృతి హాసన్.. సెగలు రేపుతున్న హాట్ మూమెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News