Chiranjeevi Multistarrer: కుర్రహీరోతో చిరు మల్టీస్టారర్..హీరోయిన్ గా శ్రీ లీల!

Chiranjeevi Multistarrer Movie Update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్టీస్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : May 5, 2023, 08:17 PM IST
Chiranjeevi Multistarrer: కుర్రహీరోతో చిరు మల్టీస్టారర్..హీరోయిన్ గా శ్రీ లీల!

Chiranjeevi Siddu Jonnalagadda Multistarrer: ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే ఒక మల్టీ స్టార్టర్ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. బాబీ డైరెక్షన్ లో రవితేజ ప్రధాన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా రవితేజ సరసన కేథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటించింది.

ఇక మెగాస్టార్ చిరంజీవికి మల్టీస్టారర్ సినిమాలు బాగా కలిసి వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో ఆయన మరో మల్టీస్టారర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ కాంబినేషన్ మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది, అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో ఒక మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సినిమాలో శ్రీ లీల నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Shaakuntalam OTT Release: నెల తిరక్కుండానే ఓటీటీలోకి శాకుంతలం.. ఎందులో? ఎప్పుడు రిలీజ్ అంటే?

అయితే ఆమె హీరోయిన్ గా నటించేది చిరంజీవి సరసన లేక సిద్దు జొన్నలగడ్డ సరసన అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. బంగార్రాజు, సోగ్గాడే చిన్నినాయన సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ ఈ సినిమాకి కథ అందిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించింది. షూట్ అవుట్ ఎట్ ఆలేర్ అనే వెబ్ సిరీస్ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఈ మధ్యనే శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను కూడా నిర్మించింది. ఇప్పుడు ఆమె తన తండ్రి చిరంజీవి హీరోగా ఈ సినిమా నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే చిరంజీవికి కళ్యాణ కృష్ణ కథ చెప్పినట్టుగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. చెప్పిన కథ బాగానే ఉందని అందుకు సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తే ఆలోచిస్తానని మెగాస్టార్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా మల్టీస్టారర్ అనే ప్రచారం జరుగుతూ రావడం ఆసక్తికరంగా మారింది. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది చూడాల్సి ఉంది.

Also Read: Ott Releases This week: ఈ వారం ఓటీటీలోకి 11 సినిమాలు.. ఏమేం రిలీజ్ అయ్యాయంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News