Vishwambhara update : మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమా తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక శైలి వైపు విశ్వంభర సినిమాతో వెళ్లినట్లు అనిపించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను మేకర్స్ విడుదల చేయగా పూర్తిస్థాయిలో అభిమానులను నిరాశపరిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా భారీ విఎఫ్ఎక్స్ తో సినిమా టీజర్ విడుదలవ్వడంతో అంతా కాపీ అంటూ నెటిజన్లు ఇట్టే పట్టేశారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం విశ్వంభర. దసరా సందర్భంగా చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. టీజర్ లో ఫాంటసీ అంశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ టీజర్ పై విమర్శలు మొదలయ్యాయి.
సాధారణంగా పెద్ద ప్రాజెక్టులు నుంచి టీజర్ , ట్రైలర్ విడుదలైనప్పుడు నెటిజన్స్ హాలీవుడ్ చిత్రాలతో పోల్చడం అత్యంత సాధారణమైన విషయమని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇన్ఫినిటీ వరల్డ్ ట్రైలర్ లోని ఒక షాట్ తో విశ్వంభర టీజర్ లోని ఒక షాట్ మ్యాచ్ అయ్యేలా కనిపిస్తోంది.
ఈ సినిమా టీజర్ లో ఉత్కంఠ భరితమైన యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నాయని చిరంజీవి సూపర్ హీరోగా అవతరించడం ఆసక్తిని కలిగిస్తోందని అభిమానులు సైతం కామెంట్లు చేశారు. అయితే టీజర్ లో కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ చిత్రం నుండి కాపీ చేశారు అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఇకపోతే ఇందులో కొంతమంది దీనిని కాపీ చేశారు అని కామెంట్లు చేస్తుండగా.. మరి కొంతమంది పెద్ద ఎత్తున సినిమా తీస్తున్నప్పుడు అందులోని అంశాలు కచ్చితంగా ఒకే విధంగా ఉంటాయి అంటూ సమర్థిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాల స్థాయికి తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందని కూడా మెగా ఫ్యాన్స్ మద్దతు పలుకుతూ ఉండడం గమనార్హం.
ఇంకొంతమంది మొత్తం కాపీ అయితే ఎలా మాస్టారు అంటూ చిరంజీవిని ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి సినిమా కాపీనా లేక ఒరిజినలా అనే విషయం తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడాలని, మధ్యలో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయకూడదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇకపోతే విశ్వంభర టీజర్ లోని వీఎఫ్ఎక్స్ ఇప్పటికే విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసిన విషయం తెలిసిందే. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter