close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన సైరా మూవీ యూనిట్ !!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరపైకి వస్తున్న సైరా మూవీ షూట్ కు గుమ్మడికాయ కొట్టేశారు.

Updated: Jun 25, 2019, 10:15 PM IST
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన సైరా మూవీ యూనిట్ !!

మెగా స్థార్ చిరంజీవి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.  చిరు నటిస్తున్న సైరా సినిమాకు సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది. సుదీర్ఘకాలం పాటు సాగిన సైరా మూవీ ఎట్టకేలకు పూర్తయింది. నిన్న జరిగిన ప్యాచ్ వర్క్ తో ఈ సినిమా టోటల్ షూట్ పూర్తయింది. అలా సైరా షూట్ కు గుమ్మడికాయ కొట్టేశారు. 

సైరా షూటింగ్ పూర్తవ్వడంతో ఇకపై చిత్ర యూనిట్ అంతా పోస్ట్-ప్రొడక్షన్ పై దృష్టి సారించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి డబ్బింగ్ స్టార్ట్ చేశారని టాక్. మరో రెండు రోజుల్లో ఆ డబ్బింగ్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయిపోతాయి. కీలకమైన గ్రాఫిక్స్ తో పాటు డీఐ వర్క్ కు కాస్త ఎక్కువ సమయం పట్టేలా ఉంది.

అందాల భావ నయనతార, మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాహుబలి అనుష్క ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. దాదాపు రూ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 22న ఈ సినిమాకు సంబంధించి టీజర్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరు నటిస్తున్న సైరా మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఖైదీ నెంబర్ 151 తర్వాత వస్తున్న చిరు మూవీ ఇదే కావడం.. దీనికి చాలా రావడంతో మళ్లీ మెగాస్టార్ ను తెరపై చూసుకునేందుకు  ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో  ఘూటింగ్ ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా పూర్వండలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.