Mufasa - The Lion King: 'ది లయన్ కింగ్' సిరీస్‌లో వస్తోన్న మరో మూవీ 'ముఫాసా'.. ట్రైలర్‌కు విశేష స్పందన..

Mufasa - The Lion King: హాలీవుడ్‌లో కొన్ని చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎపుడు ఉంటుంది. అలాంటి చిత్రాల్లో 'ది లయన్ కింగ్' మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ మూవీలో భాగంగా 'ముఫాసా' సినిమా రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 30, 2024, 01:55 PM IST
Mufasa - The Lion King: 'ది లయన్ కింగ్' సిరీస్‌లో వస్తోన్న మరో మూవీ 'ముఫాసా'.. ట్రైలర్‌కు విశేష స్పందన..

Mufasa - The Lion King: హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ లెగసీ మళ్లీ మొదలైంది. అంతేకాదు ఈ సినిమాను ఈ యేడాది డిసెంబర్ 20న విడుదల కానుంది.  ప్రైడ్ లాండ్స్ లో ముఫాసా ఎలా ఎదిగాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ సిరీస్‌లో చూపించబోతున్నాడు. వరల్డ్ వైడ్‌గా 'ది లయన్ కింగ్' మూవీ చిత్రానికి ప్రత్యకమైన అభిమానులున్నారు. 1994లో యానిమేషన్ భాగంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత మరోసారి 3D యానిమేషన్‌లో 2019లో విడుదల చేస్తే అది కూడా ప్రేక్షకాదరణ పొందింది.

తాజాగా ఇపుడు 'కింగ్'.. 'ముఫాసా' స్టోరీ బేస్‌ చేసుకొని ప్రైడ్ లాండ్స్‌లో భాగాంగా ఒక రాజుగా ఎలా ఎదిగాడనే స్టోరీతో 'ముఫాసా.. ది లయన్ కింగ్'ను డిసెంబర్ 20న ఈ యేడాది విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీని  బ్యారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆడియన్స్‌కు నిజమైన  టిక్ ఫీలింగ్ కలిగేలా లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్‌తో ఈ సినిమాను ఫోటో రియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెరీలో తీస్తున్నారు. ఈ మానియాని ఎంజాయ్ చెయ్యడానికి  ఈ యేడాది డిసెంబర్ 20 వరకు ప్రేక్షకులు వెయిట్ చేయకతప్పదు.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News