Mythri Movie Makers New Distribution office in Nizam: తెలుగులో ప్రారంభించిన కొన్ని రోజులకే మంచి సూపర్ హిట్ లు అందుకున్న నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు పేరు ఉంది. సినిమాల నిర్మాణమే ప్రారంభించడమే శ్రీమంతుడు లాంటి సినిమాతో ప్రారంభించి వరుస హిట్లు అందుకుంటున్న ఈ నిర్మాణ సంస్థ అతి తక్కువ కాలంలోనే దాదాపుగా అందరూ స్టార్ హీరోలను కవర్ చేసి టాప్ నిర్మాణ సంస్థగా రూపాంతరం చెందింది.
ఎర్నేని రవిశంకర్, ఎలమంచిలి నవీన్, మోహన్ చెరుకూరి అనే ముగ్గురు స్నేహితులు కలిసి ప్రారంభించిన ఈ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి ఇప్పుడు సుధాకర్ చెరుకూరి తప్పుకొని ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించే పనిలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నిర్మాణ సంస్థ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుందని, డిసెంబర్ రెండో తేదీన ఆఫీస్ ఓపెనింగ్ కూడా జరగబోతుందని టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి నైజాం ప్రాంతంలో నలుగురైదుగురు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కానీ పెద్ద సినిమాలు విడుదల చేయాలంటే దిల్ రాజు లేదా ఏషియన్ సునీల్ చేతుల మీద గాని విడుదల చేయాల్సి ఉంటుంది క్రాక్ లాంటి సినిమాతో సక్సెస్ అందుకుని తెరమీదకు వచ్చిన వరంగల్ శీను లైగర్, ఆచార్య లాంటి భారీ డిజాస్టర్లతో మళ్ళీ పత్తా లేకుండా పోయాడు. ఇప్పుడు ఏ పెద్ద సినిమా విడుదల చేయాలన్నా దిల్ రాజు, లేకుంటే ఏషియన్ సునీల్ మాత్రమే ఒక ఆప్షన్ గా కనిపిస్తున్నారు.
దీంతో రెండు మూడు సినిమాలు విడుదల చేయాల్సినప్పుడు దిల్ రాజు లేకుంటే ఏషియన్ సునీల్ చెప్పిందే వేదంగా నిర్మాతలు కూడా భావించాల్సి వస్తోంది. అయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ పలు స్టార్ హీరోలతో కాంటాక్ట్లు ఉన్న తాము డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన టైంకి తమ సినిమాలు విడుదల చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నైజాం ప్రాంతంలో ఒక ఆఫీస్ ప్రారంభించబోతుందని టాక్ వినిపిస్తోంది, దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని డిసెంబర్ రెండవ తేదీన అధికారికంగా ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తారని అంటున్నారు. మరి చూడాలి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయి అనేది.
Also Read: Kushi Movie Postponed: కొంప ముంచిన సమంత.. ఖుషీ రిలీజ్ లేనట్టే.. బయటపెట్టిన విజయ్ దేవరకొండ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook