Love Story: లవ్ స్టోరీ షూటింగ్ స్టార్ట్..శేఖర్ కమ్ముల రూల్స్ ఇవే

ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ( Sekhar kammula) తాజగా నాగచైతన్యతో ( Naga Chaitanya ) తెరకెక్కిస్తోన్న మూవీ లవ్ స్టోరీ.

Last Updated : Sep 7, 2020, 05:11 PM IST
    • ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ( Sekhar kammula) తాజగా నాగచైతన్యతో ( Naga Chaitanya ) తెరకెక్కిస్తోన్న మూవీ లవ్ స్టోరీ.
    • ఈ మూవీలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. కరోనావైరస్ వల్ల ( Coronavirus) కొన్ని నెలల పాటు నిలిచిపోయిన చిత్రీకరణ మళ్లీ ప్రారంభం అయింది.
Love Story: లవ్ స్టోరీ షూటింగ్ స్టార్ట్..శేఖర్ కమ్ముల రూల్స్ ఇవే

ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ( Sekhar kammula) తాజగా నాగచైతన్యతో ( Naga Chaitanya ) తెరకెక్కిస్తోన్న మూవీ లవ్ స్టోరీ. ఈ మూవీలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. కరోనావైరస్ వల్ల ( Coronavirus) కొన్ని నెలల పాటు నిలిచిపోయిన చిత్రీకరణ మళ్లీ ప్రారంభం అయింది. దీని సంబంధించి ప్రముఖ ఫిలిం క్రిటిక్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేసి సమాచారం అందించారు.

ఆరు నెలల గ్యాప్ తరువాత హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభం అయినట్టు తెలిపారు. ఈ మూవీని నారాయణ్ దాస్ కే నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ తెరకెక్కిస్తున్నారు. ఇది నాగచైతన్య 19వ చిత్రం.

ఇక షూటింగ్ విషయంలో శేఖర్ కమ్ముల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కోవిడ్-19 ( Covid-19) సంక్రమణ నుంచి టీమ్ ను దూరంగా ఉంచడానికి కొన్ని నియమాలు సెట్ చేశారు. 

ఇందులో..
- కేవలం 15 మంది షూటింగ్ క్రూ మాత్రమే ఉంటారు.
- షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఎవరూ లొకేషన్ నుంచి పక్కకు వెళ్లకూడదు. 
- సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్క్ ధరించడం తప్పనిసరి.
- సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ పూర్తి చేయాలి. 
- ప్రభుత్వ నియమాలు పాటించాలి. 

Trending News