Niharika's COVID-19 test: నిహారిక కరోనా పరీక్షలపై స్పందించిన నాగబాబు

Nagababu about Niharika's COVID-19 test | మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, అల్లుడు చైతన్యలకు కరోనావైరస్ పరీక్షలపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేసింది.

Last Updated : Dec 31, 2020, 10:19 PM IST
Niharika's COVID-19 test: నిహారిక కరోనా పరీక్షలపై స్పందించిన నాగబాబు

Nagababu about Niharika's COVID-19 test | మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, అల్లుడు చైతన్యలకు కరోనావైరస్ పరీక్షలపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేసింది. మరోవైపు అల్లు శిరీష్ సైతం తాను రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. రెండుసార్లు నెగటివే వచ్చిందని తెలిపాడు. మెగా కాంపౌండ్‌లో మొదలైన కరోనా కలకలం కొత్తగా పెళ్లయిన నిహారిక, చైతన్య జంటను ఇబ్బంది పెడుతోంది. ఇటీవలే మాల్దీవులకు హనీమూన్‌కి వెళ్లొచ్చిన నిహారిక, చైతన్య ( Niharika's Maldives trip ) వల్లే మెగా ఫ్యామిలీలోకి కరోనా ప్రవేశించిందా అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వారిని నొప్పిస్తోంది. 

Also read : Mahesh Babu's daughter Sithara: సితారకు కరోనా పరీక్షలు.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై నాగబాబు క్లారిటీ ఇచ్చాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే.. మాల్దీవులకు వెళ్లడానికంటే ముందే డిసెంబర్ 26న చైతన్య, నిహారిక కరోనావైరస్ పరీక్షలు ( COVID-19 tests ) చేయించుకున్నారని తెలిపాడు. అలాగే డిసెంబర్ 29న మాల్దీవుల నుంచి తిరిగొచ్చాకా ముంబైలో వారికి కరోనా పరీక్షలు జరిగాయని.. రెండు సందర్భాల్లోనూ వారికి కరోనా నెగటివ్ ఫలితమే వచ్చిందని నాగబాబు ( Nagababu ) తన ట్విటర్‌ పోస్టులో పేర్కొన్నాడు.

Also read : Bigg Boss Telugu 4 Grand Finale Rating: బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే రేటింగ్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News