Nandamuri Balakrishna : బాలయ్య బాబు మంచి మనసు.. క్యాన్సర్ పేషెంట్ కోసం కదిలిన నటసింహం

Nandamuri Balakrishna Helps to Cancer Patient నందమూరి బాలకృష్ణ చేసే సహాయ కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తూ ఉన్న సంగతి జనాలందరికీ తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2023, 09:59 PM IST
  • థియేటర్లో వీర సింహా రెడ్డి సందడి
  • క్యాన్సర్ పేషెంట్‌ కోసం బాలయ్య సాయం
  • బోన్ క్యాన్సర్ కోసం పది లక్షల సాయం
Nandamuri Balakrishna : బాలయ్య బాబు మంచి మనసు.. క్యాన్సర్ పేషెంట్ కోసం కదిలిన నటసింహం

Nandamuri Balakrishna Helps to Cancer Patient నందమూరి బాలకృష్ణ సినిమా పరంగా వచ్చిన క్రేజ్ కంటే.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా చేస్తూ ఉన్న మంచి పనుల వల్ల ఇంకెంతో గుర్తింపు వచ్చింది. బాలయ్య చేసే సహాయ కార్యక్రమాలు ఎక్కువగా వెలుగులోకి రావు. కానీ బాలయ్య మాత్రం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటాడు. బాలయ్య ప్రస్తుతం వీర సింహా రెడ్డి సినిమాతో మంచి జోష్‌లో ఉన్నాడు.

థియేటర్లో బాలయ్య ఇప్పుడు సందడి చేస్తున్నాడు. వీర సింహా రెడ్డికి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో దుమ్ములేపుతున్నాడు. వాల్తేరు వీరయ్య ముందంజలో ఉన్నా కూడా బాలయ్య రేసులో పరిగెడుతున్నాడు. ఓవర్సీస్‌లో మాత్రం చిరంజీవి క్లియర్‌గా తన ఆదిపత్యాన్ని చూపిస్తున్నాడు. బాలయ్య సైతం వీర సింహా రెడ్డితో దూసుకెళ్తున్నాడు. ఇలాంటి సమయంలో బాలయ్యకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

బాలయ్య తన దృష్టికి వచ్చిన ఏ సమస్యను కూడా పరిష్కరించుకుండా వదిలి పెట్టడని అంతా అంటుంటారు. క్యాన్సర్ పేషెంట్ల గురించి తన దృష్టికి వస్తే బాలయ్య ఏ క్షణంలోనైనా స్పందిస్తాడని, ఎంతటి సాయాన్ని అయినా చేస్తాడంటూ అందరూ చెబుతుంటారు. తాజాగా అలాంటి ఓ ఘటనే ఇప్పుడు జరిగిందట.

అనంతపురంకు చెందిన ఓ ఇంటర్ స్టూడెంట్‌కు బోన్ క్యాన్సర్ ఉందని బాలయ్య తెలుసుకున్నాడట. ఈ విషయం తెలిసిన వెంటనే బాలయ్య స్పందించాడట. పది లక్షల ఖర్చు అవుతుందని తెలిసి బాలయ్య ముందుకు వచ్చాడట. వెంటనే రియాక్ట్ అయిన బాలయ్య ఆ అమ్మాయికి చికిత్స చేయిస్తున్నాడట.. ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయిందట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. బాలయ్య మంచి మనసు తెలిసి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు.

Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్

Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News