Balakrishna Vs NTR : అబ్బాయితో తలపడుతున్న బాబాయ్.. కంగారు పడుతున్న ఫ్యాన్స్..

NTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా తన కెరియర్లో 109వ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2023, 02:03 PM IST
Balakrishna Vs NTR : అబ్బాయితో తలపడుతున్న బాబాయ్.. కంగారు పడుతున్న  ఫ్యాన్స్..

NBK109 : ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాతో బిజీగా ఉన్నారు. తారక్ కెరియర్ లో 30వ సినిమా గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న బాలయ్య 109 సినిమా కూడా అదే సమయంలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యనే భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య తాజాగా ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

బాలయ్య కరియర్ లో 109 సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 29 న విడుదల కాబోతోంది. మరోవైపు దేవర సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలోకి రాబోతోంది అంటే ఈ రెండు సినిమాలకి మధ్య కేవలం ఒక వారం మాత్రమే తేడా ఉంది. ఈ నేపథ్యంలో నందమూరి హీరోల మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ రాబోతోందని తెలుస్తోంది.

అయితే ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి పోటీ పడటం ఇది మొదటిసారి కాదు. 2016 సంక్రాంతి సమయంలో కూడా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో విడుదలైన ఒక రోజు తర్వాత బాలకృష్ణ డిక్టేటర్ సినిమా విడుదలైంది. అందులో ఎన్టీఆర్ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. 

మరోవైపు దేవర సినిమా ఐలాండ్, పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది అని తెలుస్తోంది. హైదరాబాద్, వైజాగ్, గోవా లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో భారీగానే వీ ఎఫ్ ఎక్స్ కూడా ఉండబోతుందని సమాచారం. తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా మిగతా భారతీయ భాషల్లో కూడా విడుదల కి సిద్ధం అవుతుంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవి చందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News