Nandita Swetha Swimming Pics : స్విమ్మింగ్ పూల్‌లో నందితా శ్వేత.. తడి అందాలతో చలి పుట్టించేస్తోందిగా

Nandita Swetha Latest Pics టాలెంట్ ఉన్న హీరోయిన్లలో నందితా శ్వేత కూడా ఉంటుంది. కానీ ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. కొత్త పాత్రలను చేసేందుకు నందిత ముందుంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 08:27 PM IST
  • కొత్త ఏడాది స్పెషల్ పిక్స్
  • స్విమ్మింగ్ పూల్‌లో నందిత
  • తడి అందాలతో నందిత శ్వేత సందడి
Nandita Swetha Swimming Pics : స్విమ్మింగ్ పూల్‌లో నందితా శ్వేత.. తడి అందాలతో చలి పుట్టించేస్తోందిగా

Nandita Swetha Swimming Pics కొన్ని సార్లు అందంగా ఉన్న హీరోయిన్లకు టాలెంట్ అంతగా ఉండకపోవచ్చు. టాలెంట్ ఉన్న హీరోయిన్లు అంత అందంగా ఉండకపోవచ్చు కానీ వారికి మాత్రం కచ్చితంగా గుర్తింపు వస్తుంటుంది. అందం, టాలెంట్ ఉన్న నందితా శ్వేతకు మాత్రం రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. ఎన్ని రకాల జానర్లు ట్రై చేసినా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసినా కూడా నందితకు సరైన హిట్ పడలేదు.

కన్నడ సుందరి అయిన నందితా శ్వేత ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే వచ్చింది. అయితే ఆమె ఎంట్రీ కన్నడలో జరిగింది. నంద లవ్స నందిత అనే సినిమాతో నందిత ఎంట్రీ ఇచ్చింది.

కన్నడ ఇండస్ట్రీతో ఎంట్రీ ఇచ్చినా కూడా ఆమెకు ఎక్కువగా తమిళ చిత్రాలతోనే గుర్తింపు వచ్చింది. కోలీవుడ్‌లోనే ఆమెకు ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. అట్టకత్తి అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది నందిత.

అదే తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఎక్కడికి పోతావు చిన్నివాడా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మొదటి సినిమానే బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. నిఖిల్‌తో కలిసి చేసిన ఈ సినిమాతో నందితకు మంచి పేరు వచ్చింది.

ఎక్కడికి పోతావు చిన్నివాడ సినిమా తరువాత తమిళ, తెలుగు భాషల్లో పలు ఆఫర్లు వచ్చాయి. శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమ కథా చిత్రమ్ 2 అంటూ ఇలా చాలా సినిమాల్లోనే నటించింది.

అయితే నందితా శ్వేత తెలుగులో అక్షర అనే సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను చేసింది. అది అంతగా ఆడలేకపోయింది. అయినా ప్రస్తుతం నందిత బుల్లితెరపై దుమ్ములేపేస్తోంది. ఢీ, జబర్దస్త్ వంటి షోల్లో కనిపిస్తుంటుంది. నందితా శ్వేత తాజాగా సోషల్ మీడియాలో హీటును పెంచేసింది. స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతూ తడి అందాలతో బికినీలో కనిపించింది నందిత. దీంతో నందిత అందరినీ అవాక్కయ్యేలా చేసినట్టు అయింది.

Trending News