Navdeep Drug Case: డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. హీరో నవ్‌దీప్‌కు నోటీసులు

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవలే పట్టుబడ్డ హైదరాబాద్ లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాతో టాలీవుడ్ ప్రొడ్యూసర్, హీరోకి సంబంధం ఉన్నట్టు విచారణలో తేలింది. ఆ వివరాలు..   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 03:50 PM IST
Navdeep Drug Case: డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. హీరో నవ్‌దీప్‌కు నోటీసులు

Navdeep Drug Case: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం డ్రగ్స్ స్కాండల్ కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ లో ఇటీవలే పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాతో తెలుగు చిత్రసీమకు సంబంధించిన వ్యక్తులకు సంబంధం ఉందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్, హీరో ఈ డ్రగ్స్ దందాకి సంబంధాన్ని కలిగి ఉన్నారని పోలీసు విచారణలో తేలింది. ఈ టాపిక్ ఇప్పుడు చిత్రసీమలో కలవరాన్ని కలిగిస్తోంది. 
ఇటీవలే హైదరాబాద్ లోని ఓ అపార్ట్‌మెంట్స్ డ్రగ్స్ వినియోగాన్ని బహిర్గతం చేసిన నార్కోటిక్స్ బ్యూరో.. పట్టుబడిన నిందితుల్ని తాజాగా కోర్టులో హాజరుపరిచింది. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న పోలీసు విచారణ మరింత ముమ్మరంగా సాగుతోంది. మాదక ద్రవ్యాలను వినియోగించిన లేదా సరఫరా చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. 

తాజాగా ఈ కేసులో హీరో నవ్‌దీప్ పేరు వినిపిస్తోంది. అతని కూడా నోటీసులు జారీ చేసినట్లు నార్కోటిక్ పోలీసులు స్పష్టం చేశారు. అయితే హీరో నవ్‌దీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని హైదరాబాద్ సీపీ ఆనంద్ వెల్లడించారు. దీనిపై స్పందించిన హీరో నవ్‌దీప్.. తాను హైదరాబాద్‌ లోనే ఉన్నానని, ఎక్కడికీ పారిపోలేదని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు హీరో నవ్‌దీప్. 

ప్రముఖ నిర్మాత పరారీ..

విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన 'షాడో' సినిమాని రూపొందించిన నిర్మాత ఉప్పలపాటి రవి పరారీలో ఉన్నారు. ఈ డ్రగ్స్ కేసులో అతను కీలక నిందితునిగా నార్కోటిక్ బ్యూరో వెల్లడించింది. అతన్ని గాలించడం సహా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పబ్ లపై నార్కోటిక్ పోలీసులు గట్టి నిఘా ఉంచారు. 

Also Read: Birth Certificate: ఇక నుంచి బర్త్ సర్టిఫికెట్ చాలు గురూ.. అన్నింటికి సింగిల్ డాక్యుమెంట్‌గా..  

నగరంలోని పాపులర్ పబ్ లుగా పేరు గడించిన.. గచ్చిబౌలిలోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్ లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రోలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ముఖ్యంగా ఈ పబ్బుల్లో నిర్మాత డ్రగ్స్ సప్లై చేస్తున్నారని అధికారులు అంటున్నారు. ప్రముఖ మోడల్ శ్వేత కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో దొరికిపోయిన కేపీ చౌదరి కాంటాక్ట్ లోనూ ఈమె పేరు బయటకు వచ్చింది. మరోవైపు ఇందులో సూత్రధారి అయిన ఈవెంట్ ఆర్గనైజర్ కలహార్ రెడ్డి కోసం నార్కోటిక్ పోలీసులు వేటాడుతున్నారు. కర్ణాటకలోని బెంగళూరు సినీ ప్రముఖల డ్రగ్స్ కేసులోనూ కలహార్ రెడ్డి నిందితునిగా ఉన్నారు.

Also Read: MLC Kavitha: ఈడీ నోటీసులను లైట్‌ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత.. విచారణకు డుమ్మా..?   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News