Netflix Movies: నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సినిమాల పండుగ, సలార్, దేవర, పుష్ప 2 అన్నీ అందులోనే స్ట్రీమింగ్, ఎప్పుడంటే

Netflix Movies: సంక్రాంతి సందర్భంగా అటు థియేటర్ ఇటు ఓటీటీల్లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. సంక్రాంతి తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి  ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 15, 2024, 07:25 PM IST
Netflix Movies: నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సినిమాల పండుగ, సలార్, దేవర, పుష్ప 2 అన్నీ అందులోనే స్ట్రీమింగ్, ఎప్పుడంటే

Netflix Movies: సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే గుంటూరు కారం, సైంథవి, నా సామిరంగ, హనుమాన్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అటు ఓటీటీల్లో కూడా కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 అప్పుడే ఓటీటీ ఎప్పుడు, ఎందులో అనేది తెలిసిపోయింది. 

సంక్రాంతి తరువాత అల్లు అర్జున్ నటించిన పుష్ప 2, జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలతో పాటు మరో పాన్ ఇండియా సినిమా కల్కి విడుదల కానున్నాయి. పుష్పతో దేశమంతా ఓ ఊపు ఊపిన అల్లు అర్జున్ ఇప్పుుడు పుష్ప 2తో ముందుకొస్తున్నాడు. పుష్ప మొదటి భాగాన్ని మించి ఉంటుందని అంచనాలున్నాయి. సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 2021లో విడుదలైన పుష్ప మొదటి భాగంలో డైలాగ్స్, పాటలు, సిగ్నేచర్ స్టెప్స్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాయి. అటు అల్లు అర్జున్‌కు ఈ సినిమాలో నటనకు నేషనల్ అవార్డు లభించింది. అందుకే పుష్క 2 పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పుష్ప 2 సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతోంది. 

పుష్ప 2 సినిమా విడుదలకు ముందే ఓటీటీ వేదిక ఖరారైంది. అమెజాన్ ప్రైమ్‌తో పోటీ పడి నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు పుష్ప 2 ఓటీటీ హక్కులు సాధించింది. పుష్ప మొదటి భాగాన్ని 30 కోట్లకు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ పుష్ప 2ను ఏకంగా 100 కోట్లుకు దక్కించుకున్నట్టు సమాచారం. ధియేటర్‌లో విడుదలైన 45-60 రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. త్వరలో మరి కొన్ని సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. సలార్, దేవర్, గ్యాంగ్ ఆఫ్ గోదావరి, బడ్డి, విజయ్ దేవరకొండ సినిమా విడి 13, డీజే టిల్లు 2 సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. 

Also read: Ayodhya Ram Temple: అయోధ్య రామమందిరం నిర్మాణ ఖర్చు, విరాళాలు, ప్రత్యేకతలు తెలుసుకుందామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News