Ayodhya Ram Temple: అయోధ్య రామాలయం నిర్మాణాన్ని రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ చేపట్టింది. 2020లో ఆయోధ్య రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన తరువాత నిధుల సేకరణ ప్రారంభమైంది. పూర్తిగా విరాళాలతో రామమందిరం నిర్మాణం జరుగుతోంది.
2021లో అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం 44 రోజులపాటు రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ విరాళాలు సేకరించింది. 44 రోజుల్లో 2100 కోట్లు సేకరించారు. వాస్తవానికి రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ 1000 కోట్ల విరాళాలు వస్తాయని అంచనా వేయగా అంతకు రెట్టింపు వచ్చింది. ఆ తరువాత కొన్ని నెలలకు ఈ విరాళాలు 3 వేల కోట్లు దాటేశాయి. నగదు రూపంలో వచ్చిన ఈ విరాళాలు కాకుండా కొన్ని పారిశ్రామిక, కార్పొరేట్ సంస్థలు నిర్మాణ సామగ్రి, పరికరాలు సమకూర్చాయి.
మూడు దశల్లో నిర్మిస్తున్న ఆలయానికి తొలుత 1800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా,,ఆ తరువాత ఊహించినదానికంటే అధికంగా అవుతోందని తెలుస్తోంది. దాదాపుగా 3200 కోట్ల వరకూ ఖర్చు ఉంటుందని అంచనా. రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు అయితే 2023 అక్టోబర్ వరకూ 900 కోట్లు ఖర్చయినట్టు మరో 3 వేల కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని ట్రస్ట్ సభ్యుడొకరు వెల్లడించారు.
అయోధ్య రామమందిరాన్ని పూర్తిగా నాగరా శైలిలో నిర్మించారు. ఈ ఆలయం పొడవు 380 అడుగులు కాగా, వెడల్పు 250 అడుగులుంటుంది.. ఎత్తు 161 అడుగులు. ఇందులో మూడు అంతస్థులుంటాయి. ఒక్కో అంతస్థు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రామమందిరం మొత్తానికి 392 పిల్లర్లు, 44 గుమ్మాలుంటాయి. ఆలయం మొదటి అంతస్థు పూర్తి కాగా అందులోనే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన చేయనున్నారు. ఇక్కడే రామ్ దర్బార్ ఉంటుంది.
Also read: Ap Politics: పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా, వైఎస్ షర్మిలకు మార్గం సుగమం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook