Nikhil cried for Karthikeya 2 Postponement: 2014వ సంవత్సరంలో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా ఎంత సూపర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఆ సీక్వెల్ సినిమా ఎట్టకేలకు అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ వంటివి సినిమా మీద ఆసక్తి పెంచేశాయి.
అయితే సినిమా జూలై నెలలోనే విడుదల కావాల్సి ఉంది కానీ అప్పట్లో థాంక్యూ సినిమా విడుదల నేపథ్యంలో సినిమా వాయిదా వేసుకోవాలని దిల్ రాజు కోరినట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయం మీద ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు హీరో నిఖిల్. ఇలా సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండడంతో తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఏడ్చానని వెల్లడించాడు. సినిమా రిలీజ్ అవ్వదు అని అనుకుంటున్న సమయంలో చాలా ఏడ్చాను అని అలా లైఫ్ లో మొదటిసారి సినిమా కోసం ఏడ్చినట్టు నిఖిల్ తెలియజేశాడు.
ఇక థాంక్యూ సినిమా ఉన్నప్పుడు నాగచైతన్య సినిమా ఉండడంలో థియేటర్లు దొరకవన్నారు, ఆగస్టు ఒకటో వారంలో వద్దాం అని ప్రయత్నిస్తే అప్పుడు బింబిసార సినిమా విడుదల ఉంది కాబట్టి అప్పుడు దొరకవన్నారని ఎట్టాకేలకు ఆగస్టు 12వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నామని అన్నారు. అప్పుడు కూడా నితిన్ సినిమా ఉంది కాబట్టి ఇస్తారో ఎవరో తెలియదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అంతేకాక హ్యాపీ డేస్ నుంచి కూడా తనకు ఎప్పుడూ ఈ థియేటర్ల సమస్య గురించి తెలియదని ఇప్పుడు అసలు నా సినిమా రిలీజ్ అవుతుందో అవ్వదో అనే భయంతో ఏడ్చానని కూడా చెప్పకొచ్చారు.
ఇక ఎట్టకేలకు సినిమా ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటూ నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఎవరైతే సినిమా ఆగడానికి కారణం అని నెటిజన్లు భవిస్తూ కామెంట్లు చేస్తున్నారో భావించారో వారే తన సినిమాకు సహాయం చేస్తున్నారని ఆయన చెప్పడం గమనార్హం. తమ సినిమా నిర్మాతల ప్రమేయంతో దిల్ రాజు, ఏషియన్ సునీల్ వంటి వారు తన సినిమాకు థియేటర్లు వచ్చేలా చూసుకుంటున్నారని నిఖిల్ చెప్పడం గమనార్హం.
Also Read: Jabardasth: జబర్దస్త్ లో కొత్త యాంకర్ ఎంట్రీ.. ఆ హాట్ భామకే అవకాశం?
Also Read:M.S. Rajashekhar Reddy: కులాల కుంపటి.. సొంత సినిమా ఈవెంట్ కే రాలేని పరిస్థితుల్లో నితిన్ డైరెక్టర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook