Ooru Peru Bhairavakona: 'ఊరి పేరు భైరవ కోన' సినిమాకు షాక్.. విడుదల ఆపాలంటూ కోర్టులో కేసు..

Ooru Peru Bhairavakona: సందీప్ కిషన్ హీరోగా డిఫరెంట్ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ఊరి పేరు భైరవకోన'. తాజాగా ఈ సిపనిమా రిలీజ్‌ను ఆపాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో వైజాగ్‌కు చెందిన ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కోర్టు కెక్కారు.

Last Updated : Feb 15, 2024, 02:15 PM IST
Ooru Peru Bhairavakona: 'ఊరి పేరు భైరవ కోన' సినిమాకు షాక్.. విడుదల ఆపాలంటూ కోర్టులో కేసు..

Ooru Peru Bhairavakona: ఈ మధ్యకాలంలో పలు సినిమాలు విడుదలకు ముందు ఫైనాన్షియల్ క్రైసిస్‌లో చిక్కుకుంటున్నాయి. అప్పట్లో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' మూవీతో పాటు చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' సినిమాల విషయంలో ఇదే చిక్కులు ఏర్పడ్డాయి. ఈ ఆర్దిక లావాదేవీల కారణంగా అఖిల్ 'ఏజెంట్' మూవీ ఇప్పటికీ ఓటీటీ విడుదల నోచుకోలేదు. తాజాగా 'ఊరు పేరు భైరవకోన' మూవీ విడుదలను ఆపాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో విశాఖ పట్నంకు చెందిన ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ కేసు దాఖలు చేశారు.

అడ్వంచర్స్ ఇంటర్నేషనల్, ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్  సంస్థ అధినేతలైన అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని వైజాగ్‌కు చెందిన ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టుకు ఎక్కారు. గతేడాది రిలీజైన 'ఏజెంట్' సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు 5 యేళ్ల పాటు తనకు సంబంధించిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ రాసిచ్చారు. తీరా తన వద్ద రూ. 30 కోట్లు తీసుకొని అగ్రిమెంట్ ప్రకారం హక్కులు ఇవ్వకుండా వాళ్లు తనను మోసగించిన విషయాన్ని ప్రస్తావించారు.

తనకు మూడు రాష్ట్రాలకు చెందిన హక్కులు ఇస్తామని చెప్పి కేవలం విశాఖ పట్నం జిల్లాకు చెందిన హక్కులు మాత్రమే ఇచ్చారన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తన నెక్ట్స్ సినిమా రిలీజ్‌కు ముందు నా డబ్బులు చెల్లిస్తామని లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ ఇచ్చి కూడా సమాధానం దాటవేస్తున్నారన్నారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో నేను న్యాయం కోసం కోర్టుకు ఎక్కానన్నారు. తన డబ్బులు తిరిగి చెల్లించేంత వరకు 'ఊరు పేరు భైరవకోన' సినిమా విడుదలపై స్టే ఇవ్వాలంటూ ఈరోజు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో (OS No. 658/2024) గురువారం వాదనలు జరగనున్నాయి. మరి కోర్టు ఈ సినిమా విడుదలపై ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

ఇదీ చదవండి: వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 7 ఫోటోస్ మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News