Oscar Awards 2024:అట్ట‌హాసంగా ఆస్కార్ అవార్డుల ప్ర‌ధానోత్సం.. ఏ సినిమా ఎక్కువ అవార్డులు గెలుచుకుందంటే.. ?

Oscar Awards 2024: ప‌్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినిమా ప్రేమికులు ఎదురు చూసే అవార్డుల్లో ఆస్కార్ అవార్డుల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇక హాలీవుడ్‌కు చెందిన న‌టీనటుల‌కైతే త‌మ లైఫ్‌లో ఒక్క సారైన ఈ అవార్డులు అందుకోవాల‌ని క‌ల‌లు కంటూ  ఉంటారు. ఈ సారి జ‌రిగిన 96వ అకాడ‌మీ అవార్డుల్లో ఏ ఈ సినిమా ఎక్కువ అవార్డులు కైవ‌సం చేసుకుందంటే..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 11, 2024, 08:52 AM IST
Oscar Awards 2024:అట్ట‌హాసంగా ఆస్కార్ అవార్డుల ప్ర‌ధానోత్సం.. ఏ సినిమా ఎక్కువ అవార్డులు గెలుచుకుందంటే.. ?

Oscar Awards 2024: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. మరి కాసేపట్లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న నేపథ్యంలో ఈ అవార్డు ఎపుడు ఎలా ప్రారంభమైంది. దానికి సంబంధించిన విషయాలేంటో చూద్దాం..

96వ ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మం ఎంతో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేట‌ర్ వేదిక‌గా 96వ అకాడ‌మీ అవార్డుల కార్య‌క్ర‌మం జ‌ర‌గుతోంది. ఈ అవార్డుల్లో ఓపెన్ హైమ‌ర్ మూవీ ప‌లు విభాగాల్లో స‌త్తా చాటింది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్ట‌ర్.. బెస్ట్ యాక్ట‌ర్, బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్, బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ, ఎడిగింగ్, బెస్ట్ ఒరిజిన‌ల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స‌హా ప‌లు విభాగాల్లో ఈ సినిమా స‌త్తా చాటింది.
ఓపెన్ హైమ‌ర్ సినిమాలోని న‌ట‌న‌కు కిల‌య‌న్ మ‌ర్ఫీ, అటు ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా క్రిస్టోరఫ‌ర్ నోల‌న్  ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఉత్త‌మ స‌హాయ న‌టుడు విభాగంలో రాబ‌ర్డ్ డౌనీ జూనియ‌ర్.. ఉత్త‌మ ఎడిటింగ్ విభాగంలో జెన్నీఫ‌ర్ లేమ్, బెస్ట్ ఒరిజ‌న‌ల్ బ్యాక్ గ్రౌండ్ స‌హా ఆరు విభాగాల్లో ఈ సినిమా స‌త్తా చాటింది.

అటు ఉత్త‌మ న‌టిగా ఎమ్మా స్టోన్ ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది. ఉత్తమ స‌హాయ న‌టి విభాగంలో డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డ్‌వ‌ర్స్‌) అవార్డు అందుకుంది. బెస్ట్ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగంలో 20 డేస్ ఇన్ మ‌రియోపోల్ ఎంపికైంది. బెస్ట్ హెయిర్ స్టైయిల్ అండ్ మేక‌ప్ విభాగంలో న‌డియా స్టేసీ, మార్క్ కౌలియ‌ర్ (పూర్ థింగ్స్) అకాడ‌మీ అవార్డు అందుకున్నారు. అటు బెస్ట్ అడాప్టెడ్ స్క్రీప్లే విభాగంలో కార్ట్ జెఫ‌ర్‌ప‌న్ (అమెరిక‌న్ ఫిక్ష‌న్), బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్ ప్లే (అనాట‌మీ ఆఫ్ ఫాల్) మూవీ ఎంపికైంది. బెస్ట్ యామిటమేటేడ్ ఫీచ‌ర్ ఫిల్మ్ .. ది బాయ్ అండ్ ది హిరాన్.. బెస్ట్ కాస్టూమ్ డిజ‌న్ విభాగంలో హోలి వెడ్డింగ్ ట‌న్ (పూర్ థింగ్స్).. బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ డిజైన్ .. జేమ్స్ ప్రైజ్,  షెనా హెత్ (పూర్ థింగ్స్).. బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ .. ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్.. అవార్డులు కైవ‌సం చేసుకుంది.

Also Read: AP Politics: వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం.. ప్రతిపక్షాలకు షాక్‌.. జగన్‌కు బూస్ట్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter.

Trending News