OTT Movies: ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు , వెబ్‌సిరీస్‌లు మీ కోసం

OTT Movies: ఓటీటీల్లో ప్రతి వారం వివిధ రకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే వివిధ భాషల్లో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ వారం కూడా పెద్దఎత్తున సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 13, 2024, 11:10 AM IST
OTT Movies: ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు , వెబ్‌సిరీస్‌లు మీ కోసం

OTT Movies: నచ్చిన సినిమా, నచ్చిన భాషలో నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటంతో ఓటీటీలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే ప్రతి కొత్త సినిమా ధియేటర్ రిలీజ్ డేట్‌తో పాటు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అవుతోంది. ఈ వారం కూడా హాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు పెద్దఎత్తున స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఓటీటీ విడుదల జాబితా చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లో 

నవంబర్ 12న అడ్రియెన్నే లపాలుక్కీ డి డార్క్ క్వీన్ ఇంగ్లీష్ సినిమా, నవంబర్ 13 రిటర్న్ ఆఫ్ ది కింగ్ ఇంగ్లీష్ సినిమా, హాట్ ఫాస్ట్రీ, ది మదర్ ఆఫ్ పెంగ్విన్స్ ఇంగ్లీష్ వెబ్‌సిరీస్, ఎమిలియా పెరెజ్, నవంబర్ 14న ది ఫెయిరీ అడ్ పేరెంట్స్ వెబ్‌సిరీస్, నవంబర్ 15న కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 2 వెబ్‌సిరీస్, మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ ఇంగ్లీష్ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి.

అమెజాన్ ప్రైమ్‌లో..

నవంబర్ 12న ఇన్ కోల్డ్ వాటర్ ఇంగ్లీషు వెబ్‌సిరీస్, నవంబర్ 14న క్రాస్ ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. 

జియో సినిమాలో..

నవంబర్ 13న సెయింట్ డెనిస్ మెడికల్ ఇంగ్లీషు వెబ్‌సిరీస్, నవంబర్ 14న ది మ్యూజిక్ ఆఫ్ శ్రీ హిందీ వెబ్‌సిరీస్, నవంబర్ 15న ది డే ఆఫ్ ది జాకల్ ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ విడుదల కానున్నాయి. 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..

నవంబర్ 12న డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ఇంగ్లీషు సినిమా, నవంబర్ 15న యాన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి. 

ఇక సోనీ లివ్‌లో ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ వెబ్‌సిరీస్ నవంబర్ 15న స్ట్రీమింగ్ కానుంది. జీ5లో పైథనీ వెబ్‌సిరీస్ నవంబర్ 15న విడుదల కానుంది. 

Also read: Shankar Dada MBBS: శంకర్ దాదాలో నటించిన ఈ పిల్లాడు గుర్తున్నాడా.. రకుల్, శ్రీలీలతో రొమాన్స్ చేసిన స్టార్ హీరో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News