Record Break - Nihir Kapoor:రికార్డ్ బ్రేక్ మూవీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.. హీరో నిహిర్ కపూర్..

Pan India movie record break hero Nihir Kapoor: ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. ఈ కోవలో వస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ 'రికార్డ్ బ్రేక్'. మార్చి 8న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ సినిమాలో కథానాయకుడిగా నటించిన నిహిర్ కపూర్ మీడియాతో మాట్లాడారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 4, 2024, 08:59 PM IST
Record Break - Nihir Kapoor:రికార్డ్ బ్రేక్ మూవీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది..  హీరో నిహిర్ కపూర్..

Pan India movie record break hero Nihir Kapoor: సినీ ఇండస్ట్రీలో వారుసుల ఎంట్రీ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ కోవలో సినీ ఇండస్ట్రీలో హీరోగా వచ్చిన మరో నట వారసుడు జయసుధ కుమారుడు నిహిర్ కపూర్. ఈయన గతంలో 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' సినిమాతో పరిచయ్యారు. ఇపుడు ప్యాన్ ఇండియా మూవీ 'రికార్డ్ బ్రేక్' మూవీతో పలకరించబోతున్నారు.

ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటి.. ?
'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమా చేసిన తర్వాత చదలవాడ శ్రీనివాసరావు ఈ సినిమాలో చాలా బాగా నటించావు. నా దగ్గర ఓ కథ ఉంది. దానికి నువ్వు సరిగ్గా సరిపోతావు అన్నారు. స్టోరీ వినగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించి చేస్తానని ఓకే చెప్పేసాను.   హీరోగా అని కాకుండా నా క్యారెక్టర్ నచ్చడంతో ఈ సినిమాను ఒప్పుకున్నాను.  

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఇది ఇద్దరు అనాధల స్టోరీ.  అడవిలో పెరుగుతాము. మేము ట్విన్స్. అడవిలో కుస్తీ నేర్చుకొని సిటీకి వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ లో డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్  దాకా ఎలా వెళ్లాము. ఈ సందర్బంగా జరిగిన ప్రయాణాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు.

గతంలో 'దంగల్'  లాంటి సినిమాలు ఇలాంటి కథతోనే వచ్బాయి కదా. దానికి దీనికి ఉన్న తేడాలేమిటి.. ?
ఇది కూడా కమర్షియల్ సినిమానే. దంగల్ తో పోలిక ఉండదు. అందులో కుస్తీ పోటీలు ఇవన్నీ డీటెయిల్ గా ఉంటాయి. ఇందులో కుస్తీ పోటీల గురించి చెబుతూ ఇద్దరు అనాధల జర్నీ ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళింది.  అలాగే సెంటిమెంట్ ఎమోషనల్ అన్ని కలగలిపిన ఒక కమర్షియల్ సినిమా. మంచి మదర్ సెంటిమెంట్ సాంగ్స్ ఫైట్స్ అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి.

వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు కదా ఈ కాన్సెప్ట్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ కి ఎలా రెలవెంట్ గా ఉంటుంది?
ఇందులో డబ్ల్యూ డబ్ల్యూ పోటీలు చూపిస్తున్నాము. కుస్తీ పోటీల నుంచి డబ్ల్యు డబ్ల్యు ఈ దాకా జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. రాజస్థాన్ హర్యానా లాంటి ప్రాంతాల్లో కుస్తీ పోటీలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఆ డీటైలింగ్ మీద నార్త్ వాళ్ళు ఎక్కువ సినిమాలు తీస్తారు. కానీ మన సినిమాలో కుస్తీ పోటీలతో పాటు మిగతా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇది తెలుగు సినిమా అయినా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. ఇలాంటి సినిమా తెలుగుతోనే ఆగిపోకూడదు. అందుకే ఎనిమిది భాషల్లో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ చేయబోతున్నాము.

మిగతా లాంగ్వేజెస్ లో ఎలా ప్రమోట్ చేయబోతున్నారు?
రీసెంట్ గా కన్నడ చెన్నై వెళ్లి అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. కన్నడలో రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ముంబైలో కూడా ఇలాంటి కథలు ఎక్కువగా చూస్తారు.  అక్కడ  చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా మలయాళం ఒడియాలో కూడా నెక్స్ట్ ప్రమోట్ చేస్తున్నాము.

చదలవాడ శ్రీనివాసరావు మొదటి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని ఈ సినిమా డైరెక్ట్ చేశారు? ఆయన డైరెక్షన్ ఎలా అనిపించింది?
ఆయనకు సినిమాలంటే పాషన్. ఈ కథని జనాలకి చెప్పాలనుకుంటున్నారు. ఆయన ఒక సోషల్ సబ్జెక్ట్ ని సోషల్ కాన్సెప్ట్ ని తీసుకునే సినిమాలు చేస్తారు. ఇది కూడా అలాంటి ఒక మంచి కాన్సెప్ట్. ఇది పూర్తిగా దేశభక్తి సినిమా.

చదలవాడ శ్రీనివాసరావు గారి లాంటి డైరెక్టర్ ఈ సినిమా చేస్తున్నారంటే కొత్తదనం ఏం చూపిస్తున్నారు?
యాక్షన్ సన్నివేశాలు జాషువా చేసారు.  ఆయన చేసిన ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. చదలవాడ శ్రీనివాసరావు  ఎక్స్పీరియన్స్ రెండు విజన్ అదే విధంగా జాషువా యాక్షన్ సీక్వెన్సెస్ సినిమా కి చాలా ప్లస్ అవుతాయి. అదేవిధంగా ఈ సినిమాలో హీరోయిన్ కన్నా పాత్రలను  ఎక్కువగా చూపిస్తారు.

ట్రైలర్ చూసి మీ అమ్మగారై జయసుధ గారి ఎలా స్పందించారు.
ట్రైలర్ చూసి ఎంత ఎగ్జైట్ అయ్యారు. అదే విధంగా సినిమాని కొంత చూసి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మళ్లీ ఒకసారి ఫుల్ సినిమా చూసిన తర్వాత ఏం చెప్తారు అనేది నేను వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ అయితే అమ్మగారికి చాలా నచ్చింది. ఆమె బిజీగా ఉన్నారు కథ నేనే విని నేను యాక్సెప్ట్ చేశాను. యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నావ్ అని చెప్పి చాలా మెచ్చుకున్నారు.

ఇకనుంచి మీరు కంటిన్యూ గా సినిమాలు చేస్తారా.. ?
కచ్చితంగా కంటిన్యూగా ఇక సినిమాలు చేస్తూనే ఉంటాను.

డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నారు కదా ఫ్యూచర్లో దర్శకత్వంలో చేసే ఛాన్స్ ఉందా?
కచ్చితంగా దర్శకత్వం చేస్తాను.  కాకపోతే దానికి కొంచెం సమయం ఉంది. స్క్రిప్ట్  రాసుకున్నాను ఓటీటీ కి ఫ్యూచర్ ఫిలిం కి రెండిటికి ట్రై చేస్తాను. సమయం చూసి ఖచ్చితంగా డైరెక్షన్ చేస్తాను.

Read More: Grapes Fruit Benefits: ద్రాక్ష పండు రుచికరం మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా..!

Read More: Rashmika: చిన్నప్పటి కళ ఇప్పటికి నెరవేరింది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News