Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. గెట్ రెడీ!

Pawan Kalyan Birthday treat from Hari Hara Veera Mallu is on the Way: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్బంగా హరిహర వీరమల్లు యూనిట్ నుంచి ట్రీట్ సిద్దం అవుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2022, 06:31 PM IST
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. గెట్ రెడీ!

Pawan Kalyan Birthday treat from Hari Hara Veera Mallu is on the Way: రాజకీయాలకు ఫుల్ టైం కేటాయిస్తానని పేర్కొన్న పవన్ కళ్యాణ్ పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోవడంతో తర్వాత మళ్ళీ సినిమాలు చేయడానికి సిద్దమయ్యారు . అందులో భాగంగా ఆయన వరుస సినిమాలు లైన్ లో పెట్టారు కానీ అందులో రెండే సినిమాలు మూడేళ్ల వ్యవధిలో చేయగలిగారు. ఇక ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

క్రిష్ డైరెక్షన్లో ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు ఉన్న పండుగల సాయన్న అనే ఒక బందిపోటు పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మొగలుల కాలంలో జరిగినట్లుగా చెప్పబడుతున్న ఒక ఈ పీరియాడిక్ డ్రామా మూవీ షూటింగ్ రెండేళ్ల క్రితమే మొదలైంది. కానీ కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో కూడా ఈ సినిమా షూటింగ్ కు ఇబ్బందులు ఏర్పడేలా చేసింది.

షూటింగ్ మొదలు పెడదాం అనుకున్న సమయంలో సినీ నిర్మాతలు అందరూ కలిసి సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ వాయిదా పడింది. దీంతో ఒక దశలో అసలు ఈ సినిమా ఉంటుందా లేక సినిమా నిలిపివేశారా అని అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే సెప్టెంబర్ రెండో తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ పవన్ అభిమానులకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ బ్రాండ్ న్యూ పోస్టర్ అలాగే ఫోటోలు కూడా విడుదల చేయాలని సినిమా యూనిట్ నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇంకా సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రమోషన్ స్టఫ్ విడుదల చేయకుండా ఈ రేంజ్ లో అంచనాలు ఏర్పడడంతో సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాక సినిమా మీద మరిన్ని అంచనాలు ఏర్పడతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదని అంటున్నారు.

Also Read: Shock to Balakrishna Producers: బాలయ్య నిర్మాతలకు షాకిచ్చిన సుప్రీం కోర్టు.. ఏమైందంటే?

Also Read: Poonam Kaur on Jesus Christ: జీసస్ పై పూనం సంచలనం.. ఎప్పుడు పుట్టాడు? ఎవరికి పుట్టాడు అంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News