Pawan Kalyan- Balakrishna: ఫ్యాన్స్ కు మెంటలెక్కించేలా పవన్ – బాలయ్య ఫేస్ టు ఫేస్..త్రివిక్రమ్ ఫోన్ కాల్ తో మేటర్ లీక్!

Pawan Kalyan and Trivikram To attend Unstoppable with NBK 2: అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే రెండో సీజన్ రెండో ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 16, 2022, 03:29 PM IST
Pawan Kalyan- Balakrishna:  ఫ్యాన్స్ కు మెంటలెక్కించేలా పవన్ – బాలయ్య ఫేస్ టు ఫేస్..త్రివిక్రమ్ ఫోన్ కాల్ తో మేటర్ లీక్!

Pawan Kalyan and Trivikram To attend Unstoppable with NBK 2: ఒకప్పుడు తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు- నందమూరి తారక రామారావు మధ్య హీరోలుగా మంచి పోటీ ఉండేది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులందరూ విశేషంగా ఆదరించిన కుటుంబం ఏదైనా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి కుటుంబమే. ఒకరకంగా ఇప్పుడు కూడా నందమూరి కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య పోటీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే నందమూరి కుటుంబానికి చెందిన ఒక హీరో మెగా కుటుంబానికి ఒక చెందిన ఒక హీరో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్, సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి నందమూరి మెగా కుటుంబాల హీరోలు కలవబోతున్నారు.

అయితే ఇది సినిమా కోసం కాదు ఒక షో కోసం. నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ కూడా గ్రాండ్గా లాంచ్ చేశారు. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణతో కలిసి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తమ మనసులోని విషయాలు బయటపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మొదటి ఎపిసోడ్ 24 గంటల్లో మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది అంటే ఎంతలా హీట్ అయితుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్టోబర్  21వ తేదీన ఈ సీజన్ రెండో ఎపిసోడ్ స్ట్రీమ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రోమో విడుదల చేశారు.

ఇక ఈ ఎపిసోడ్ కి మాస్ కాదా విశ్వక్సేన్ డీజే టిల్లుతో సూపర్ హిట్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. వారితో నందమూరి బాలకృష్ణ పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ కూడా ఈ ఎపిసోడ్కి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే భీమ్లా నాయక్ సినిమాకి ఫస్ట్ అనుకున్న హీరో ఎవరు అని అడగటంతో ఒక్కసారిగా నాగవంశీ షాకయ్యారు. ఎందుకంటే అప్పట్లో రానా, బాలకృష్ణతో కలిసి ఈ సినిమా చేయాలని చాలా రోజులు ప్రయత్నం చేశారు. దీంతో ఆయన ఒక్కసారిగా నవ్వేశారు. ఆ తర్వాత త్రివిక్రమ్ గురించి ప్రశ్నిస్తూ త్రివిక్రమ్ బయట సినిమాలు ఇక చేయరా అని అడిగితే ఆయన బయటకు వెళ్లడం మాకు ఇష్టం లేదంటూ నాగవంశీ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

ఇక ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ త్రివిక్రమ్ కి ఫోన్ చేయగా త్రివిక్రమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎప్పుడు అన్ స్టాపబుల్ షోకి వస్తున్నావు అని ప్రశ్నిస్తే మీరు పిలిస్తే వెంటనే వచ్చేస్తాను అంటూ త్రివిక్రమ్ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది, అయితే ఎవరితో రావాలో తెలుసుగా అంటూ బాలకృష్ణ గ్యాప్ ఇవ్వడంతో త్రివిక్రమ్ రెండు నిమిషాల పాటు స్టన్ అయిపోయాడు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యంతో వారిద్దరిని ఎపిసోడ్కి సిద్ధం కమ్మని బాలకృష్ణ కోరాడని వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఇక ఈ సీజన్ చివరి ఎపిసోడ్ గా నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో ఉండబోతుందని దానికి ఇప్పటినుంచే లీక్ ఇచ్చేసారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ కాంబినేషన్ లో ఒక ఎపిసోడ్ పడితే మాత్రం ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు కావడం ఖాయమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కేవలం సినీ సెలబ్రిటీలనే కాదు ఇప్పుడు రాజకీయ నాయకులను కూడా తీసుకువస్తూ ఉండడంతో ఈ షో మీద మరింత ఆసక్తి ఏర్పడుతోంది. చూడాలి రాబోయే సీజన్లు రాబోయే ఎపిసోడ్లు ఇంకెంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి అనేది.

Also Read: Unstoppable with NBK : బాలయ్యను పడగొట్టేసిన రష్మిక మందన.. నేషనల్ క్రష్ అంటే మామూలుగా ఉండదు

Also Read: Theatres Seating Capacity : ఇండియాలోని అతి పెద్ద థియేటర్లు ఇవే.. హైద్రాబాద్‌లోనే హయ్యస్ట్ సీటింగ్ కెపాసిటీ.. లిస్ట్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News