Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించిన ఈ సినిమా తెలుసా..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ .. అభిమానులకు ఈ పేరు తారక మంత్రం. ప్రస్తుతం జనసేనానిగానే కాకుండా..ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో  ఓ సినిమాలో కూడా నటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 7, 2024, 08:10 AM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించిన ఈ సినిమా తెలుసా..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకాలే. ఈయన అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా టైటిల్స్ తో మాత్రం పవన్ కళ్యాణ్ కాకుండా.. కళ్యాణ్ అని ఉంటుంది. ఈ సినిమాలో పాత్ర పేరు కూడా అదే కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘గోకులంలో సీత’ సినిమా చేసాడు.

ఈ సినిమా నుంచే కళ్యాణ్ బాబుగా ఉన్న తన పేరును ‘పవన్ కళ్యాణ్’ గా మార్చుకున్నాడు.  మెగా కుటుంబానికి ఆంజనేయ స్వామి భక్తులు.  అప్పట్లో అన్నయ్య శివ శంకర్ వర ప్రసాద్ నుంచి ఆంజనేయ స్వామి మారు పేరుగా  చిరంజీవిగా  పేరు మార్చుకొని మెగాస్టార్ అయ్యారు.  ఈ సినిమా ఎఫెక్ట్ ఏమో.. చిరంజీవి ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా హనుమంతుడి పేరు వచ్చేలా కళ్యాణ్ పేరు ముందు పవన్ చేర్చుకొని పవన్ కళ్యాణ్ అయ్యాడు. హనుమాన్ మహత్యమో ఏమో .. పవర్ స్టార్ గా ఎదిగారు. అంతేకాదు రాజకీయంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. త్వరలో ముఖ్యమంత్రిగా ఆయన్ని చూడాలనుకుంటున్నారు అభిమానులు.

ఇక పవన్ కళ్యాణ్ రెండో చిత్రం ‘గోకులంలో సీత’ సినిమాలో తన సొంత పేరు పవన్ కళ్యాణ్ పేరుతో నటించడం విశేషం. ఆ సినిమా తర్వాత మరే ఇతర సినిమాల్లో పవన్ కళ్యాణ్ తన ఓన్ నేమ్ తో నటించలేదు. పవన్ విషయానికొస్తే.. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మూడు నెలల తర్వాత నెలకు ఐదు రోజులు చొప్పున తాను ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ముందు ముందు అనేక పదవులు అధిరోహించాలని కోరుకుందాం.

Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News