Pawan Kalyan - Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌ 'హరిహర వీరమల్లు' మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..

Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 30, 2024, 01:57 PM IST
Pawan Kalyan - Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌ 'హరిహర వీరమల్లు' మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..

Pawan Kalyan - Hari Hara Veera Mallu : జనసేనాని అలియాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలున్నాయి. అందులో క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మొదలై దాదాపు ఐదేళ్లు కావొస్తోంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కొలిక్కి రావడం లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈ నెల 2న ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ధర్మం కోసం యుద్ధం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎన్నికల తర్వాత మొదలైన ఈ సినిమా 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లో తొలి ప్యాన్ ఇండియా మూవీ.

ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 60 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు అన్ని భాషలకు కలిపి రూ. 35 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మొత్తంగా డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ కలిపి దాదాపు రూ. 110 కోట్ల టేబుల్ ప్రాఫిట్ విడుదలకు ముందే నిర్మాతకు వస్తున్నాయి.

మరోవైపు పవన్ కళ్యాణ్.. సుజిత్ దర్శకత్వంలో  'ఓజీ' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీటైంది. ఈ సినిమాను ఈ యేడాది సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.ఆ డేట్‌లో విడుదల చేయడం అనేది డౌటే అని సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్‌ శంకర్ దర్శకత్వంలో  'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై  భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News