Pawan Kalyan: భార్య, పిల్లలతో పవన్ కళ్యాణ్ పిక్ వైరల్.. ఈ ఫోటో వెనుక స్టోరీ ఏమిటంటే..!

Pawan Kalyan and Akira Nandan: ప్రస్తుతం సినిమాల కన్నా కూడా పాలిటిక్స్ వల్ల.. బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ మధ్యనే ఈ హీరో.. డెప్యూటీ సీఎంగా.. ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతూ.. అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 23, 2024, 10:04 PM IST
Pawan Kalyan: భార్య, పిల్లలతో పవన్ కళ్యాణ్ పిక్ వైరల్.. ఈ ఫోటో వెనుక స్టోరీ ఏమిటంటే..!

Pawan Kalyan Family Photo: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి.. సంబంధించిన ఒక ఫోటో.. ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. ఆయన అభిమానులను ప్రేమలో పడేస్తోంది. పవన్ కళ్యాణ్ తన భార్య.. అనా లెజినోవా, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి దిగిన.. అందమైన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో.. అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.  ఈ ఫోటోను జనసేన పార్టీ.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 

జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రమాణం చేసిన తర్వాత తీసుకున్న.. ఫొటో ఇదని..ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట అని.. క్యాప్షన్ కూడా పెట్టింది జనసేన పార్టీ.. సోషల్ మీడియా పేజీ. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. ఈ నెల 12న.. ప్రమాణ స్వీకారం చేసిన తరవాత.. తీసుకున్న అందమైన ఫోటో ఇది. ప్రమాణ స్వీకారం చేసి.. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో నివాసానికి బయలుదేరాలనుకొంటే - ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వెంటనే వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి.. సేద తీరిన క్షణంలో సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో తీసుకున్న ఫోటో ఇది.. అంటూ జనసేన పార్టీ పేజ్ .. ఫోటో వెనుక ఉన్న కథను.. చెప్పుకొచ్చింది. 

జనసేన పార్టీ తమ ట్విట్టర్ అకౌంట్ లో.. ఈ ఫోటోని పోస్ట్ చేసిన.. కాసేపటికే.. ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పవన్ అభిమానులు ఈ పోస్ట్ కింద ఎన్నో కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఇందులో పవన్ కుమారుడు ఆద్య సైతం సంప్రదాయ పంచెకట్టులో కనిపించడం మరో విశేషం. రోడ్డు పక్కన చెట్ల నీడ కింద దిగిన ఈ ఫొటోను.. చూసి పవర్ స్టార్ అభిమానులు మురిసిపోతున్నారు.

కాగా పవన్ కళ్యాణ్.. చాలా సంవత్సరాల క్రితమే తన రెండో భార్య.. రేణు దేశాయ్‌కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పిల్లలు అకీరా నందన్, ఆద్య.. బాధ్యతలను సైతం రేణునే తీసుకున్నారు. కానీ వీరిద్దరూ.. తరచుగా హైదరాబాద్ వచ్చి తండ్రి దగ్గర సమయం గడుపుతుంటారు. ఇప్పుడు మూడో భార్య తో పాటు..రెండో భార్య పిల్లలతో పవన్ కళ్యాణ్ కనిపించడం అందరిని ఆకట్టుకుంది. 

 

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News