Ustaad Bhagat Singh : ఉస్తాద్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్.. కొట్టి పారేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

Pawan Kalyan Ustaad Bhagat Singh పవన్ కళ్యాణ్‌ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. ఉస్తాద్ గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్‌ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించాడు హరీష్‌ శంకర్. పవన్ లుక్స్, యాటిట్యూడ్, స్టైల్, స్వాగ్ ఇలా అన్నీ కూడా అద్భుతంగా అనిపించాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2023, 02:04 PM IST
  • నెట్టింట్లో ఉస్తాద్ గ్లింప్స్ సందడి
  • పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు టెన్షన్
  • ఆ మాటతో సెంటిమెంట్‌
Ustaad Bhagat Singh : ఉస్తాద్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్.. కొట్టి పారేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

Ustaad Bhagat Singh Glimpse సాలా అనే పదం తెలుగు సినిమాకు అంతగా కలిసి రావడం లేదనిపిస్తోంది. సాలా క్రాస్ బ్రీడ్ అంటూ విజయ్ దేవరకొండ లైగర్‌తో నానా హంగామా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కాక ముందు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ దేశమంతా రచ్చ చేశారు. అయితే లైగర్ సినిమా రిజల్ట్ తరువాత సైలెంట్ అయిపోయారు. ఈ ఇద్దరూ కలిసి చేయాల్సిన జనగణమన సినిమా షెడ్డుకు వెళ్లిపోయింది. సాలా అనే పదంతో విజయ్ పెద్ద దెబ్బ కొట్టేసినట్టు అయింది.

ఇక అదే కోవలో అఖిల్ అక్కినేని సైతం సాలా అంటూ రెచ్చిపోయాడు. వైల్డ్ సాలా అంటూ ఏజెంట్ సినిమాతో  ఎగిరెగిరి పడ్డాడు. అయితే అఖిల్ ఏజెంట్ సినిమా ఎంత దారుణంగా బెడిసి కొట్టేసిందో అందరికీ తెలిసిందే. సాలా పదం వాడి విజయ్, అఖిల్‌లు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బ తిన్నారు. సినిమాల పరిస్థితి ఇలా ఉంటే.. ఐపీఎల్‌లో బెంగళూరు పరిస్థితి ఇంకోలా ఉంటుంది.

ఐపీఎల్‌లో ఎప్పటికైనా బెంగళూరు కప్పు కొడుతుందని అంతా అనుకుంటూ ఉంటారు. ఈ సాలా కప్ నమ్డే అంటూ ఉంటారు. కానీ ఇంత వరకు బెంగళూరు కప్పు కొట్టిందీ లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ సైతం సాలా అంటూ భారీగా యాక్షన్ చేయబోతోన్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సాలా సెంటిమెంట్ అందరినీ వెంటాడుతోంది. పవన్ కళ్యాణ్‌కు కూడా ఫ్లాపును ఇస్తుందా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

అయితే ఇలాంటి సెంటిమెంట్లు ఏం చేయలేవని కొందరు ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమాను హరీష్‌ శంకర్ తన స్టైల్లో పూర్తిగా మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. విజయ్ తేరీ సినిమాను ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే గబ్బర్ సింగ్‌ను మించేలానే ఉండబోతోన్నట్టుగా అనిపిస్తోంది.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News